Stock market: జీవితకాల గరిష్ఠాల్లో సూచీలు! - Stock markets are in Green
close

Updated : 18/10/2021 09:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: జీవితకాల గరిష్ఠాల్లో సూచీలు!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా ఉన్న బలమైన వాతావరణం సూచీలను ముందుకు నడిపిస్తోంది. గతవారం విడుదలైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, డి-మార్ట్‌ త్రైమాసిక ఫలితాలు మెప్పించడంతో ఈరోజు ఈ స్టాక్స్‌పై మదుపర్లు దృష్టిసారించే అవకాశం ఉంది. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 473 పాయింట్లు లాభపడి 61,779 వద్ద.. నిఫ్టీ 149 పాయింట్ల లాభంతో 18,487 వద్ద కొనసాగుతున్నాయి. రెండు సూచీలూ జీవితకాల గరిష్ఠాల్లో నమోదవుతున్నాయి. అమెరికా మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.37 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఆటో, ఏషియన్‌ పెయింట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌సీఎల్‌ టెక్‌ మినహా దాదాపు అన్ని షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, టైటన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, మారుతీ, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, ఎంఅండ్‌ఎం షేర్లు రాణిస్తున్న వాటిలో ఉన్నాయి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని