Stock market: కొనసాగుతున్న బుల్‌ జోరు.. సెన్సెక్స్‌ 62,000+.. నిఫ్టీ 18,500+ - Stock markets are in Green
close

Updated : 19/10/2021 09:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: కొనసాగుతున్న బుల్‌ జోరు.. సెన్సెక్స్‌ 62,000+.. నిఫ్టీ 18,500+

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. దీంతో వరుసగా ఎనిమిదో రోజూ బుల్‌ జోరు కొనసాగుతోంది. దేశీయంగా ఉన్న బలమైన వాతావరణం సూచీలను ముందుకు నడిపిస్తోంది. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 338 పాయింట్లు లాభపడి 62,104 వద్ద.. నిఫ్టీ 94 పాయింట్ల లాభంతో 18,571 వద్ద కొనసాగుతున్నాయి. రెండు సూచీలూ జీవితకాల గరిష్ఠాల్లో నమోదవుతున్నాయి. అమెరికా మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ముగిశాయి. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నేడు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.01 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌యూఎల్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు రాణిస్తున్నాయి. ఐటీసీ, పవర్‌గ్రిడ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టైటన్‌, నెస్లే ఇండియా, మారుతీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని