Stock market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు - Stock markets are in flat
close

Updated : 30/07/2021 09:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అమెరికా సూచీలు గురువారం లాభాలతో ముగియగా.. నేడు ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు ప్రతికూలంగా కదలాడుతున్నాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 16 పాయింట్ల స్వల్ప లాభంతో 52,669 వద్ద.. నిఫ్టీ 2 పాయింట్లు లాభపడి 15,780 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.33 వద్ద ట్రేడవుతోంది.

బీఎస్‌ఈ 30 సూచీలో టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, పవర్‌గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎన్‌టీపీసీ, ఎంఅండ్‌ఎం, టాటా స్టీల్‌, మారుతీ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఏషియన్ పెయింట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని