Stock market: లాభాల్లో మార్కెట్‌ సూచీలు - Stock markets are in green
close

Updated : 28/06/2021 09:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: లాభాల్లో మార్కెట్‌ సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:23 గంటల సమయంలో సెన్సెక్స్‌ 103 పాయింట్లు ఎగబాకి 53,029 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 26 పాయింట్లు లాభపడి 15,886 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.21 వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు అప్రమత్తంగా కదలాడుతున్నాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో ఏషియన్‌ పెయింట్స్‌, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, డాక్టర్‌ రెడ్డీస్‌, కొటాక్‌ మహీంద్రా షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. ఎల్‌అండ్‌టీ, టీసీఎస్‌, మారుతీ, టెక్ మహీంద్రా, టైటన్‌, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఆటో షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని