Stock market: లాభాల నుంచి నష్టాల్లోకి - Stock markets are in green
close

Published : 28/06/2021 15:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: లాభాల నుంచి నష్టాల్లోకి

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు ఇంట్రాడే గరిష్ఠాల నుంచి ఒక్కసారిగా దిగజారాయి. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వంటి కీలక కంపెనీల షేర్లు కుంగడం సూచీలపై ప్రభావం చూపింది. అలాగే ఆసియాలో పలు ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండడంతో ఆసియా మార్కెట్లు నేడు అప్రమత్తంగా కదలాడాయి. ఈ ప్రభావం కూడా సూచీలపై కనపడింది. చివరకు సెన్సెక్స్‌ 189 పాయింట్లు నష్టపోయి 52,735 వద్ద.. నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 15,814 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.18 వద్ద ట్రేడవుతోంది.

బీఎస్‌ఈ 30 సూచీలో డాక్టర్‌ రెడ్డీసీ ల్యాబ్స్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్‌, సన్‌ షార్మా, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. టైటన్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, రిలయన్స్‌, అల్ట్రాటెక్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని