Stock market: లాభాల్లో సూచీలు - Stock markets are in green
close

Updated : 30/06/2021 09:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: లాభాల్లో సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. వరుసగా రెండు రోజుల నష్టాల నేపథ్యంలో కీలక రంగాల్లో తాజా కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. ఉదయం 9:38 గంటల సమయంలో సెన్సెక్స్‌ 102 పాయింట్ల లాభంతో 52,652 వద్ద.. నిఫ్టీ 30 పాయింట్లు లాభపడి 15,779 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.24 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఆసియా మార్కెట్లు సైతం నేడు లాభాల్లో కొనసాగుతున్నాయి  రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌, మారుతీ, టీసీఎస్‌ వంటి కీలక కంపెనీల షేర్లు రాణిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే నేడు సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో మారుతీ, ఇన్ఫోసిస్‌, ఏషియన్ పెయింట్స్‌, టైటన్‌, టాటా స్టీల్‌, ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ, నెస్లే ఇండియా, బజాజ్‌ ఆటో షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. పవర్‌ గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని