`ఆర్‌డీ`ల‌పై అత్య‌ధిక వ‌డ్డీరేటు అందిస్తున్న బ్యాంకులు - Small-finance-banks-offer-upto-7.5-interest-rate-on-recurring-deposit
close

Updated : 06/07/2021 12:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

`ఆర్‌డీ`ల‌పై అత్య‌ధిక వ‌డ్డీరేటు అందిస్తున్న బ్యాంకులు

చిన్న ఫైనాన్స్ బ్యాంకులు రిక‌రింగ్ డిపాజిట్ (ఆర్‌డీ)కి 6.25% నుండి 7.5% వ‌ర‌కు కూడా వ‌డ్డీ రేటును అందిస్తున్నాయి.  చాలా చిన్న ఫైనాన్స్ బ్యాంకులు క‌నీసం 6 నెల‌లు, గ‌రిష్టంగా 10 సంవ‌త్స‌రాల రిక‌రింగ్ డిపాజిట్ (ఆర్‌డీ)ల‌ను ప్రారంభించాయి. రూ. 100 కంటే త‌క్కువ‌తో కూడా ఈ `ఆర్‌డీ`ల‌ను ప్రారంభించ‌వ‌చ్చు. అయితే డిపాజిట‌ర్ మొద‌ట `ఆర్‌డీ` తెర‌వ‌డానికి ముందు బ్యాంకులో పొదుపు ఖాతా క‌లిగి ఉండాల‌ని మెజారిటీ బ్యాంకులు ఆశీస్తున్నాయి. వ‌డ్డీ రేట్లు వాటి నిబంధ‌న‌లు, ష‌ర‌తుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని చిన్న ఫైనాన్స్ బ్యాంకుల‌లో రిక‌రింగ్ డిపాజిట్ (ఆర్‌డీ)లు ఆక‌ర్ష‌ణీయంగా ఉంటున్నాయి. రిక‌రింగ్ డిపాజిట్ (ఆర్‌డీ) కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ లాంటిదే. ఫిక్స్‌డ్ డిపాజిట్ ఒకేసారి పెద్ద మొత్తం డిపాజిట్ చేస్తాం. ఆర్‌డీ ప్ర‌తీనెలా కొంత మొత్తంలో `సిప్‌` వ‌లె డిపాజిట్ చేస్తాం.

ఈ `ఆర్‌డీ`ల వ‌డ్డీ రేట్లు వాటి కాల‌వ్య‌వ‌ధిపై ఆధార‌ప‌డి ఉంటాయి. ఒక సంవ‌త్స‌ర `ఆర్‌డీ` కంటే 3 ఏళ్ల `ఆర్‌డీ`కి అధిక వ‌డ్డీ రేటు ఉండొచ్చు. బ్యాంకుల‌తో పాటు `ఇండియా పోస్ట్‌` కూడా దాని చిన్న పొదుపు ప‌థ‌కాల కింద `ఆర్‌డీ`ని అందిస్తుంది. ఇండియా పోస్ట్‌, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎప్‌సీ బ్యాంక్ 5.4% నుండి 5.8% వ‌ర‌కు `ఆర్‌డీ`ల‌కు వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తున్నాయి.

  • `ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్` 25 నుండి 36 నెల‌లు, 61 నుండి 120 నెల‌ల ఆర్‌డీపై 6.25% వ‌డ్డీని అందిస్తుంది. 
  • `నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌` త‌న రెండేళ్ల ఎఫ్‌డీపై 7.5% వ‌డ్డీ రేటు అమ‌లు చేస్తుంద‌ని బ్యాంక్‌ వెబ్‌సైట్ తెలిపింది.
  • `ఉత్క‌ర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్` 24 నుండి 36 నెల‌ల ఆర్‌డీపై 7% వ‌డ్డీ రేటును ఆఫ‌ర్ చేస్తుంది.
  • చాలా ఇత‌ర చిన్న ఫైనాన్స్ బ్యాంకులు అత్య‌ధికంగా 6.5% నుండి 6.75% వ‌ర‌కు ఆర్‌డీ వ‌డ్డీ రేట్లు క‌లిగి ఉన్నాయి. వీటిలో ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌, ఇసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌, శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌, సూర్యోద‌య స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌, ఉజ్జీవ‌న్ స్మాల్ ఫైనాన్స్‌, జ‌న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఉన్నాయి.

చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఎక్కువ భాగం 5 ఏళ్ల లోపు `ఆర్‌డీ`ల‌కే త‌మ అత్య‌ధిక వ‌డ్డీని అందిస్తున్నాయి. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 90 నెల‌లు అంత‌కంటే ఎక్కువ కాల‌వ్య‌వ‌ధి ఆర్‌డీల‌కు అత్య‌ధికంగా 6.5% వ‌డ్డీ రేటును అందిస్తుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని