Stock market: స్వల్ప లాభాల్లో సూచీలు - Stock markets are in green
close

Updated : 07/07/2021 09:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: స్వల్ప లాభాల్లో సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల నేపథ్యంలో నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు క్రమంగా లాభాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్‌ 103 పాయింట్ల లాభంతో 52,964 వద్ద.. నిఫ్టీ 22 పాయింట్లు లాభపడి 15,840 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.65 వద్ద ట్రేడవుతోంది. ఒపెక్‌ కూటమిలో నెలకొన్న ప్రతిష్టంభనతో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. దీంతో అంతర్జాతీయంగా పలు మార్కెట్లలో బాండ్ల రాబడులు ఎగబాకాయి. ఇది ఆయా సూచీలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. పైగా చైనా టెక్‌ కంపెనీలపై నియంత్రణలను కఠినతరం చేస్తుండడంతో ఆసియా మార్కెట్లు సైతం నేడు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. అయితే, దేశీయంగా కీలక రంగాల్లో కొనుగోళ్లు, ఎఫ్‌ఐఐల వెల్లువ మార్కెట్లకు దన్నుగా నిలుస్తోంది.

బీఎస్‌ఈ 30 సూచీలో ఏషియన్ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌, మారుతీ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. టైటన్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌యూఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎల్‌అండ్‌టీ, ఇన్ఫోసిస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని