Stock market: లాభాల్లో సూచీలు - Stock markets are in green
close

Updated : 13/07/2021 09:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: లాభాల్లో సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు సూచీలను ప్రభావితం చేస్తున్నాయి. ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్‌ 236 పాయింట్ల లాభంతో 52,609 వద్ద.. నిఫ్టీ 70 పాయింట్లు లాభపడి 15,763 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.52 వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు సానుకూలంగా కదలాడుతున్నాయి. దేశీయంగా స్థిరాస్తి, ఇంధన, బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాలు రాణిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సూచీలు లాభాల బాట పట్టాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్ ఫినాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, ఎంఅండ్ఎం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని