Stock market: మార్కెట్‌ సూచీల్లో కొనసాగుతున్న లాభాల జోరు! - Stock markets are in green
close

Updated : 27/09/2021 09:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: మార్కెట్‌ సూచీల్లో కొనసాగుతున్న లాభాల జోరు!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో లాభాల జోరు కొనసాగుతోంది. గతవారపు ర్యాలీ సోమవారమూ కొనసాగుతోంది. సూచీలు భారీ లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. ఉదయం 9:23 గంటల సమయంలో సెన్సెక్స్‌ 236 పాయింట్లు ఎగబాకి 60,285 వద్ద.. నిఫ్టీ 66 పాయింట్ల లాభంతో 17,920 వద్ద కొనసాగుతున్నాయి. శుక్రవారం చరిత్రాత్మక 60,000 పాయింట్ల శిఖరానికి చేరిన సెన్సెక్స్ ఆ మైలురాయిని నిలబెట్టుకుంటుండగా.. నిఫ్టీ 18,000 మైలురాయిపై కన్నేసింది. ఈవారం నిఫ్టీ ఈ కీలక మైలురాయిని అందుకోవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.71 వద్ద ట్రేడవుతోంది. గతవారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఐరోపా మార్కెట్లు నష్టాలు చవిచూశాయి. ఆసియా మార్కెట్లు నేడు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగాయి.

నిఫ్టీ 50 సూచీలో ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్‌, మారుతీ, ఎంఅండ్‌ఎం, ఐషర్‌ మోటార్స్‌, కోల్‌ ఇండియా, ఎస్‌బీఐ, బజాజ్‌ ఆటో, బీపీసీఎల్‌, ఐఓసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హీరో మోటోకార్ప్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌, దివీస్ ల్యాబ్స్‌, విప్రో, సిప్లా, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, టాటా కన్జ్యూమర్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఏషియన్ పెయింట్స్‌, నెస్లే ఇండియా షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి. ఆటో, పీఎస్‌యూ, ఆయిల్‌అండ్‌గ్యాస్‌, స్థిరాస్తి, ఇన్‌ఫ్రా, బ్యాంకింగ్‌ రంగ షేర్లు రాణిస్తుండగా.. ఐటీ, సాంకేతికత, లోహ, విద్యుత్తు రంగ షేర్లు డీలాపడ్డాయి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని