Stock market: భారీ నష్టాల్లో సూచీలు - Stock markets are in red
close

Updated : 19/07/2021 09:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: భారీ నష్టాల్లో సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 351 పాయింట్ల నష్టంతో 52,784 వద్ద.. నిఫ్టీ 99 పాయింట్లు నష్టపోయి 15,826 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.75 వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు గతవారం నష్టాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు సైతం నేడు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. ద్రవ్యోల్బణ భయాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. దేశీయంగా బ్యాంకింగ్‌, ఆర్థిక, లోహ, ఆటో, స్థిరాస్తి రంగ షేర్లు సూచీలను దెబ్బతీస్తున్నాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, టైటన్‌, రిలయన్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా..హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఆటో, ఇన్ఫోసిస్‌, టాటా స్టీల్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని