Stock market: కొనసాగుతున్న నష్టాలు - Stock markets are in red
close

Updated : 20/07/2021 09:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: కొనసాగుతున్న నష్టాలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో సోమవారం నాటి నష్టాల పరంపర మంగళవారమూ కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతల ప్రభావం సూచీలపై ఇంకా కనపడుతోంది. ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్‌ 216 పాయింట్ల నష్టంతో 52,336 వద్ద.. నిఫ్టీ 62 పాయింట్లు నష్టపోయి 15,691 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.92 వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు సైతం నేడు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. కరోనా, ద్రవ్యోల్బణ, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై భయాలు మదుపర్లను వెంటాడుతున్నాయి. దేశీయంగా ఇంధన, బ్యాంకింగ్‌, టెలికం, ఆర్థిక, లోహ రంగ షేర్లు సూచీలను దెబ్బతీస్తున్నాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో పవర్‌ గ్రిడ్‌, అల్ట్రాటెక్ సిమెంట్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఐటీసీ, మారుతీ, నెస్లే ఇండియా, బజాజ్ ఆటో, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా..హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎంఅండ్‌ఎం, భారతీ ఎయిర్‌టెల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫినాన్స్‌, టాటా స్టీల్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని