Stock market: అంతర్జాతీయ ప్రతికూలతలు.. నష్టాల్లో దేశీయ సూచీలు! - Stock markets are in red
close

Updated : 28/07/2021 09:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: అంతర్జాతీయ ప్రతికూలతలు.. నష్టాల్లో దేశీయ సూచీలు!

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా సూచీలు మంగళవారం నష్టాలతో ముగిశాయి. నేడు ఆసియా మార్కెట్లు ప్రతికూలంగా కదలాడుతున్నాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ 239 పాయింట్ల నష్టంతో 52,339 వద్ద.. నిఫ్టీ 74 పాయింట్లు నష్టపోయి 15,671 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.46 వద్ద ట్రేడవుతోంది.

బీఎస్‌ఈ 30 సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఫినాన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టెక్‌ మహీంద్రా షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, ఏషియన్‌ పెయింట్స్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతీ షేర్లు నష్టాలను చవిచూస్తున్నాయి. దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లో పయనిస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని