Stock market: నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు! - Stock markets are in red
close

Updated : 20/10/2021 09:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ఏడు రోజుల వరుస లాభాలకు మంగళవారం బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే. ఈరోజూ అదే ట్రెండ్‌ కొనసాగుతోంది. కీలక కంపెనీల షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ.. దేశీయ సూచీలు మాత్రం నష్టాలు చవిచూస్తున్నాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 212 పాయింట్లు నష్టపోయి 61,504 వద్ద.. నిఫ్టీ 88 పాయింట్ల నష్టంతో 18,330 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.12 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో మెజారిటీ షేర్లు నష్టాల్లో పయనిస్తున్నాయి. నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్‌, భారతీఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్అండ్‌టీ, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు రాణిస్తున్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఆటో, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, మారుతీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, టీసీఎస్‌, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని