Stock market: స్వల్ప లాభాల్లో సూచీలు - Stock markets are running in green
close

Published : 25/06/2021 09:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: స్వల్ప లాభాల్లో సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో పయనిస్తున్నాయి. ఉదయం 9:36 గంటల సమయంలో సెన్సెక్స్‌ 87 పాయింట్లు లాభపడి 52,786 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 32 పాయింట్లు ఎగబాకి 15,822 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.15గా కొనసాగుతోంది. అమెరికా మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు సానుకూలంగా కదలాడుతున్నాయి. అయితే, నిన్నటి లాభాల నేపథ్యంలో నేడు మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతన్నట్లు కనిపిస్తోంది. రిలయన్స్, కొటాక్‌మహీంద్రా బ్యాంక్‌ వంటి కీలక కంపెనీల షేర్లు నష్టాలు చవిచూస్తుండడం సూచీల లాభాల్ని కట్టడి చేస్తున్నాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో టాటా స్టీల్‌, మారుతీ, సన్‌ ఫార్మా, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టెక్‌ మహీంద్రా షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. రిలయన్స్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, నెస్లే ఇండియా షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని