Stock market: నష్టాల నుంచి లాభాల్లోకి - Stock markets ended in green
close

Published : 25/06/2021 15:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: నష్టాల నుంచి లాభాల్లోకి

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం కాస్త ఊగిసలాట ధోరణి కనబరిచిన సూచీలు క్రమంగా పుంజుకొని ఇంట్రాడే గరిష్ఠాల్ని నమోదు చేశాయి. లోహ, బ్యాంకింగ్‌ రంగాల మద్దతుతో పాటు టాటా స్టీల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ వంటి కీలక కంపెనీలు రాణించడం సూచీలకు దన్నుగా నిలిచింది. చివరకు సెన్సెక్స్‌ 226 పాయింట్లు ఎగబాకి 52,925 వద్ద ముగియగా.. నిఫ్టీ 69 పాయింట్లు లాభపడి 15,860 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.17 వద్ద నిలిచింది. అమెరికా మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు సానుకూలంగా కదలాడాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎల్అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. రిలయన్స్, ఎన్‌టీపీసీ, టైటన్‌, హెచ్‌యూఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఆటో, నెస్లే ఇండియా షేర్లు నష్టాలు చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని