Stock market: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్‌ సూచీలు - Stock markets opened in green
close

Updated : 26/10/2021 09:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్‌ సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. వరుసగా నాలుగు సెషన్లలో నష్టాలు చవిచూసిన మార్కెట్లు సోమవారం కోలుకున్న విషయం తెలిసిందే. నేడు అదే పరంపరను కొనసాగిస్తున్నాయి. అమెరికా మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు సానుకూలంగా ట్రేడయ్యాయి. నేడు ఆసియా మార్కెట్లలో హాంగ్‌సెంగ్‌ మినహా మిగిలిన సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ 296 పాయింట్ల లాభంతో 61,263 వద్ద.. నిఫ్టీ 95 పాయింట్లు ఎగబాకి 18,220 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.06 వద్ద కొనసాగుతోంది.

సన్సెక్స్‌ 30 సూచీలో.. టెక్ మహీంద్రా, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫినాన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐటీసీ లాభాల్లో ఉన్నాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌యూఎల్‌, పవర్‌గ్రిడ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, నెస్లే ఇండియా, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని