Stock market: సూచీల్లో లాభాల జోరు - Stock markets traded higher
close

Published : 21/05/2021 15:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: సూచీల్లో లాభాల జోరు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయమే సానుకూలంగా ప్రారంభమైన సూచీలు సమయం గడుస్తున్న కొద్దీ గరిష్టాల దిశగా పరుగులు తీశాయి. చివరకు సెన్సెక్స్‌ 972 పాయింట్లు లాభపడి 50,540 వద్ద ముగియగా.. నిఫ్టీ 269 పాయింట్లు ఎగబాకి 15,175 వద్ద స్థిరపడింది. ఓ దశలో సెన్సెక్స్‌ 1000 పాయింట్లకు పైగా లాభపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.84 వద్ద నిలిచింది.

దాదాపు కీలక రంగాల షేర్లన్నీ లాభాల్లో దూసుకెళ్లాయి. దేశీయంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో ఆర్థిక వ్యవస్థ బలోపేతంపై ఆశలతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. అలాగే పలు సంస్థల నాలుగో త్రైమాసిక ఫలితాలు సానుకూలంగా నమోదవ్వడం కూడా సూచీలకు దన్నుగా నిలిచింది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉండడం సైతం సూచీలను ముందుకు నడిపించాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ నష్టాలు చవిచూడగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీయ ఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం, ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని