లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు - Stock opened in green
close

Updated : 27/04/2021 09:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల్లో పయనిస్తున్నాయి. మంగళవారం ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 161 పాయింట్లు ఎగబాకి 48,547 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 51 పాయింట్లు లాభపడి వద్ద 14,536 ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.89 వద్ద కొనసాగుతోంది. ఒక్క బ్యాంకింగ్‌ మినహా దాదాపు అన్ని రంగాల సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి.

అమెరికా మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మాత్రం నేడు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. కీలక రంగాల నుంచి మద్దతు లభిస్తుండడం సూచీల దన్నుగా నిలుస్తోంది. అయితే, సూచీల కదలికల్లో కొవిడ్‌ అప్రమత్తత స్పష్టమవుతోంది. కరోనా కేసుల విజృంభణ, ఆసియా మార్కెట్ల డీలా నేపథ్యంలో లాభాలు ఎంత మేర కొనసాగుతాయన్నది చూడాల్సి ఉంది.

టెక్‌ మహీంద్రా, హిందాల్కో ఇండస్ట్రీస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఫినాన్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ లైప్‌ ఇన్సూరెన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌ నష్టాలు చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని