Stock Market: వరుసగా రెండో రోజూ లాభాలు - Stock opened in green
close

Updated : 27/04/2021 15:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: వరుసగా రెండో రోజూ లాభాలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆద్యంతం అదే జోరును కొనసాగించాయి. 48,424 వద్ద సానుకూలంగా ట్రేడింగ్‌ మొదలుపెట్టిన సెన్సెక్స్‌ 49,009 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 557 పాయింట్లు ఎగబాకి 48,944 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 14,493 వద్ద బలంగా ప్రారంభమై రోజులో 14,667-14,484 మధ్య కదలాడింది. చివరకు 168 పాయింట్లు ఎగబాకి 14,653 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.89 వద్ద ముగిసింది.

అమెరికా మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా, ఐరోపా మార్కెట్లు నేడు మిశ్రమంగా కదలాడాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలు ఒడిసిపట్టడం సూచీలకు దన్నుగా నిలిచింది. ముఖ్యంగా లోహ, టెలికాం, బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాలు సూచీలను ముందుకు నడిపాయి. కరోనా విజృంభణ, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై ఒత్తిడి, ఆంక్షల వంటి ప్రతికూల పరిణామాలున్నప్పటికీ.. సూచీలు వరుసగా రెండో రోజూ లాభాలు ఒడిసిపట్టడం గమనార్హం.

హిందాల్కో ఇండస్ట్రీస్‌, టాటా స్టీల్‌, దివీస్‌ ల్యాబ్‌, ఎల్‌ అండ్‌ టీ, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఎస్‌బీఐ లైప్‌ ఇన్సూరెన్స్‌, నెస్లే ఇండియా, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి. నేడు వెలువడిన మారుతీ సుజుకీ నాలుగో త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. 2020తో పోలిస్తే లాభాల్లో 9 శాతం క్షీణత నమోదైంది. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని