చెక్ బౌన్స్ కేసులను త్వరగా పరిష్కరించడానికి సుప్రీంకోర్టు కొత్త‌ మార్గదర్శకాలు - Supreme-court-new-guidelines-to-deal-with-cheque-bounce-cases
close

Published : 17/04/2021 16:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చెక్ బౌన్స్ కేసులను త్వరగా పరిష్కరించడానికి సుప్రీంకోర్టు కొత్త‌ మార్గదర్శకాలు

చెక్ బౌన్స్ కేసులను త్వరగా పరిష్క‌రించేందుకు సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాల‌ను జారీచేసింది. ఒక వ్య‌క్తిపై సంవ‌త్స‌రం లోపు ఒకే  లావాదేవీకి సంబంధించి నమోదైన కేసులలో ట్రయల్స్ క్లబ్బింగ్ అయ్యేలా చట్టాలను సవరించాలని కేంద్రాన్ని కోరింది. చెక్ బౌన్స్ కేసులను పరిష్కరించడానికి ట్రయల్ కోర్టులకు మార్గదర్శకాలను జారీ చేయాలని దేశంలోని అన్ని హైకోర్టులను సుప్రీం కోర్టు ఆదేశించింది.
ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఎ బోబ్డే నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం, చెక్ బౌన్స్ కేసుల్లోని సాక్ష్యాలను ఇప్పుడు అఫిడవిట్ల ద్వారా ప‌రిగ‌ణించ‌వ‌చ్చ‌ని, సాక్షులను ఫిజిక‌ల్‌గా పరిశీలించాల్సిన అవసరం లేదని వెల్ల‌డించారు. జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, బిఆర్ గవై, ఏఎస్ బోపన్న, ఎస్ రవీంద్ర భట్లతో కూడిన ధర్మాసనం, ఒక వ్యక్తిపై 12 నెలల్లో నమోదైన చెక్ బౌన్స్ కేసుల్లో విచారణ జరిగేలా చూడడానికి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టంలో "తగిన సవరణలు" చేయాలని కేంద్రాన్ని కోరింది. 
ఇది మునుపటి నిర్ణయాన్ని పునరుద్ఘాటించింది. చెక్ బౌన్స్ కేసులలో విచారణలను ఎదుర్కోవటానికి వ్యక్తులను పిలిపించడానికి వారి నిర్ణయాలను పునపరిశీలించడానికి ట్రయల్ కోర్టులకు "స్వాభావిక శక్తి" లేదని పేర్కొంది. దీనిపై పరిష్కారం కాని సమస్యలను బొంబాయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సి చవాన్ నేతృత్వంలోని కమిటీ పరిశీలిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది.

మార్చి 10 న, దేశవ్యాప్తంగా చెక్ బౌన్స్ కేసులను త్వరగా పరిష్కరించడానికి తీసుకోవలసిన చర్యలను పేర్కొంటూ మూడు నెలల్లో నివేదికను సమర్పించడానికి ఉన్నత న్యాయస్థానం కమిటీని ఏర్పాటు చేసింది. ఎనిమిది వారాల తరువాత చెక్ బౌన్స్ కేసులను త్వరగా ప‌రిష్క‌రించ‌డాన్ని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం సుమోటోగా విషయాన్ని తీసుకుంటుందని తెలిపింది.

ఇంతకుముందు 35 లక్షలకు పైగా చెక్ బౌన్స్ కేసుల పెండింగ్‌లో ఉండ‌టాన్ని ఒక వింత‌గా  పేర్కొంది, అలాంటి కేసులను పరిష్కరించడానికి, ఒక నిర్దిష్ట కాలానికి అదనపు కోర్టులను రూపొందించడానికి ఒక చట్టాన్ని తీసుకురావాలని కేంద్రానికి సూచించింది.

గత ఏడాది మార్చి 5 న, అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా కేసును నమోదు చేసింది. అటువంటి కేసులను త్వరగా పరిష్కరించడానికి "సంఘటిత‌ , "సమన్వయ" యంత్రాంగాన్ని రూపొందించాలని నిర్ణయించింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని