క్యూ3లో టీసీఎస్‌ లాభం 7.2% జంప్‌ - TCS Q3 net profit rises 7.2 pc
close

Updated : 09/01/2021 19:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్యూ3లో టీసీఎస్‌ లాభం 7.2% జంప్‌

ముంబయి: దేశీయ అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ సేవలు అందించే సంస్థ టీసీఎస్‌ మూడో త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. అంచనాలు మించి లాభాలను సొంతం చేసుకుంది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం రూ.8,701 కోట్లు ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.8,118 కోట్లతో పోలిస్తే ఇది 7.2 శాతం అధికం కావడం గమనార్హం.

ఇక కంపెనీ ఆదాయం సైతం 5.4 శాతం వృద్ధి చెందింది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో గతేడాది రూ.39,854 కోట్లు ఆదాయం సముపార్జించగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.42,015 కోట్లు ఆదాయం వచ్చినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో టీసీఎస్‌ పేర్కొంది. మూడో త్రైమాసికంలో ఈ స్థాయిలో వృద్ధి కనబర్చడం తొమ్మిదేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. అలాగే షేరుకు రూ.6 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను టీసీఎస్‌ ప్రకటించింది.

ఇవీ చదవండి..
గృహ రుణాలపై SBI గుడ్‌న్యూస్‌
ధరలు పెంచిన మహీంద్రా


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని