భారత్ బయోటెక్ సన్నాహాలు
అనుమతుల కోసం డీసీజీఐకి దరఖాస్తు?
కొవిడ్-19 ముప్పు నుంచి రక్షణ పొందేందుకు, ఇంజెక్షన్ ద్వారా ఇచ్చే ‘కొవాగ్జిన్’ టీకాకు అత్యవసర వినియోగ అనుమతి పొందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ‘ముక్కు ద్వారా ఇచ్చే టీకా తయారీ’ యత్నాలను వేగవంతం చేసింది. భారత్ సహా అధిక జనాభా కలిగిన దేశాలకు ముక్కు ద్వారా ఇచ్చే టీకా ఎంతో మేలైనదని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల వివిధ సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. ఇంజెక్షన్ ద్వారా ఇచ్చే టీకా ఇవ్వాలంటే సిరంజిలు, సూదులు పెద్ద సంఖ్యలో కావాలి. ఇంజెక్షన్ చేయడానికి అనుభవం గల వైద్యులు లేదా నర్సులు కావాలి. టీకా ఇచ్చిన తర్వాత సిరంజిలు, సూదులను పర్యావరణానికి హాని లేకుండా జాగ్రత్తగా పడవేయడం కూడా సమస్యే. అందుకే ముక్కు ద్వారా ఇచ్చే టీకా ఆవిష్కరించడానికి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ కొంతకాలం క్రితమే అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఇన్ సెయింట్ లూయీస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఛింప్- అడినోవైరస్‌తో ఈ టీకా అభివృద్ధి చేస్తారు. పోలియో టీకా చుక్కలు నోట్లో వేసినట్లుగా, ఈ కొవిడ్-19 టీకాను ముక్కులో వేస్తే సరిపోతుంది. ఇప్పటికే ప్రాథమిక పరీక్షలు పూర్తి కావటంతో మొదటి దశ క్లినికల్ పరీక్షల నిర్వహణకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుమతి కోరుతూ డీసీజీఐ (డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) కు దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ప్రస్తుత సన్నాహాల ప్రకారం వచ్చే మార్చి నుంచి దీనిపై మొదటి దశ క్లినికల్ పరీక్షలు మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఈ టీకాతయారీని భారత్ బయోటెక్ హైదరాబాద్‌లోని తన యూనిట్లో చేపడుతుంది. యూఎస్, జపాన్, ఐరోపా దేశాలను మినహాయిస్తే మనదేశంతో సహా మిగిలిన దేశాల్లో ఈ టీకా విక్రయించే హక్కులు భారత్ బయోటెక్‌కు ఉంటాయి. ముక్కు ద్వారా ఇచ్చే టీకాను 100 కోట్ల డోసులు తయారు చేయాలనే ఉద్దేశాన్ని అప్పట్లోనే భారత్ బయోటెక్ వెల్లడించింది.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?