ప్రీమియం తిరిగి పొందే ట‌ర్మ్ ప్లాన్‌ - TROP-benefits-and-disadvantages
close

Published : 27/12/2020 17:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రీమియం తిరిగి పొందే ట‌ర్మ్ ప్లాన్‌

భారతదేశంలో బీమా పాల‌సీల వ్యాప్తి జిడిపిలో 3.69 శాతానికే ప‌రిమిత‌మైంది .ఇది చైనా వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల కంటే చాలా తక్కువ. బీమా వ‌ల‌న వ్య‌క్తిగ‌తంగా, కుటుంభాల‌కు, ఆస్తుల‌కు భ‌ద్ర‌త ఉంటుంద‌ని ప్ర‌జల‌లో అంత‌గా అవ‌గాహ‌న క‌ల్పించ‌డంలో విఫ‌లం కావ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఇక బీమాను కొంద‌రు పెట్టుబ‌డిగా చూస్తారు. ట‌ర్మ్ పాల‌సీలో వ్య‌క్తి మ‌ర‌ణిస్తే త‌ప్ప ఎటువంటి హామీ ఉండ‌ద‌ని కొంత‌మంది వెన‌క్కి త‌గ్గుతారు. ఇటువంటివారికోస‌మే ప్రీమియం వెన‌క్కి వ‌చ్చే ట‌ర్మ్ జీవిత బీమా పాల‌సీని (TROP) అందుబాటులోకి తెచ్చారు.

టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో, పాలసీదారుడు తన జీవితానికి బీమా చేయడానికి కొంత ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తాడు. పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణించినట్లయితే, ల‌బ్దిదారుల‌కు హామీ మొత్తం చెల్లిస్తారు. ఒక‌వేళ పాల‌సీ మెచ్యూరిటీ వ‌ర‌కు పాల‌సీదారుడు జీవించి ఉంటే ఎటువంటి హామీ ఉండ‌దు. ఇప్పుడు, TROP కూడా ట‌ర్మ్ పాల‌సీ వంటిదే. కానీ ఇందులో మెచ్యూరిటీ వ‌ర‌కు పాల‌సీదారుడు జీవిస్తే చెల్లించిన ప్రీమియంల‌ను వెన‌క్కి ఇస్తారు.

ఉదాహ‌ర‌ణ‌కు ఒక వ్యక్తి 30 సంవత్సరాల పాలసీ కాలపరిమితి క‌లిగిన‌, సంవత్సరానికి 25,000 రూపాయల ప్రీమియంతో కోటీ రూపాయ‌లTROP పాల‌సీ కొనుగోలు చేశాడు. పాలసీ వ్యవధిలో మరణిస్తే, వారి నామినీల‌కు కోటి రూపాయ‌లు ల‌భిస్తుంది. పాల‌సీ ముగిక‌సేంత‌వ‌ర‌కు జీవించి ఉంటే చెల్లించిన ప్రీమియం రూ. 7,50,000 తిరిగి ఇచ్చేస్తారు.

ఒక TROP ను కొనుగోలు చేయడం ద్వారా మీకు ప్రీమియం తిరిగి వ‌స్తుంద‌ని అనుకోవ‌చ్చు. అయితే మీ కుటుంబ అవ‌స‌రాలు, ప‌రిస్థితుల‌ను బ‌ట్టి బీమా పాల‌సీల‌ను తీసుకోవాలి. ఇది మీ నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా ఉందో లేదో అర్థం చేసుకోవడానికి మీరు దాన్ని మరింతగా ప‌రిశీలించాలి.

TROP కొనేటప్పుడు పరిగణించవలసిన కొన్ని విషయాలు:
TROP ప్లాన్‌లకు ‘పెయిడ్-అప్’ ఎంపిక కూడా ఉంటుంది. మూడు సంవ‌త్స‌రాల త‌ర్వాత మీరు ప్రీమియం చెల్లింపులు ఏదైనా కార‌ణ‌ల చేత‌ మ‌ధ్య‌లో నిలిపివేస్తే పాలసీ కొనసాగుతుంది కానీ మీకు వ‌చ్చే ప్ర‌యోజ‌నాలు త‌గ్గుతాయి. చాలా సందర్భాలలో చెల్లించిన ప్రీమియం మెచ్యూరిటీ త‌ర్వాత‌ తిరిగి ఇస్తారు. ఇలా చేస్తే బీమా చేసిన వ్యక్తి మరణిస్తే నామినీకి తక్కువ మొత్తంలో హామీ లభిస్తుంది.

TROP ప్రీమియం, సాధారణ టర్మ్ ప్లాన్ ప్రీమియం కంటే ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, ఇది దాదాపు 3 రెట్లు అధికంగా ఉంటుంది. అందువల్ల పాల‌సీ తీసుకునేముందు ప్రీమియం ఎక్కువ‌గా ఉంటుంద‌ని తెలుసుకోవాలి. రెండవది, ప్రీమియంపై ఎటువంటి వ‌డ్డీ ల‌భించ‌దు, ద్రవ్యోల్బణం కోసం సర్దుబాటు కాద‌ని అర్థం చేసుకోవాలి. మీరు రూ.7,50,000 రూపాయల ప్రీమియం చెల్లిస్తే, 30 సంత్స‌రాల త‌ర్వాత కూడా రూ.7,50,000 రూపాయలు మాత్రమే తిరిగి పొందుతారు. ఏదేమైనా ఈ ప్లాన్‌లు ఒక‌దానికి ఒక‌టి భిన్నంగా ఉంటాయి కాబట్టి ప్రణాళిక నిబంధనలను న్యాయంగా సమీక్షించడం కూడా చాలా ముఖ్యం.

కొన్ని బీమా సంస్థలు ప్రీమియం మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి ఆఫర్ చేస్తున్నప్పటికీ, మొదటి నెల ప్రీమియం, పన్నులను తీసివేయడం ద్వారా లేదా అందుకున్న ప్రీమియం మొత్తం విలువలో 75 శాతం మాత్రమే చెల్లించడం ద్వారా తక్కువ ప్రయోజనాలను పొందే అవ‌కాశ‌ముంది.
పాలసీ యొక్క కవరేజీని మెరుగుపరచడానికి రైడర్ల‌ను కూడా TROP అందిస్తుంది. అయినప్పటికీ, రైడర్స్ కోసం చెల్లించే అదనపు ప్రీమియం మెచ్యూరిటీ స‌మ‌యంలో తిరిగి రాద‌ని గమనించడం ముఖ్యం.

ప్రతి బీమా పథకంలో విభిన్న ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. పాలసీని కొనుగోలు చేసే ముందు న్యాయ‌ప‌ర‌మైన అంశాల‌ను తెలుసుకోవాలి. TROP కొనుగోలు విషయానికి వస్తే, మెచ్యూరిటీ ప్రయోజనాన్ని మాత్రమే పరిగణించవద్దు. పాల‌సీల‌ను కొనుగోలు చేసేముందు మీ అవ‌స‌రాలు ,ప్రీమియం మొత్తాన్ని చెల్లించే సామర్థ్యం మీద ఆధారపడి నిర్ణ‌యం ఉండాలి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని