అపాచీ ఆర్‌టీఆర్‌ 160 4వీ ధర పెంపు - TVS Apache RTR 160 4V Prices Increased
close

Updated : 07/05/2021 08:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అపాచీ ఆర్‌టీఆర్‌ 160 4వీ ధర పెంపు

ఇంటర్నెట్‌డెస్క్‌: టీవీఎస్‌ మోటార్స్‌ కంపెనీ అపాచీ ఆర్‌టీఆర్‌ 160 4వీ ధరను పెంచింది.  ఈ పెంపు రూ.1,250 వరకూ ఉంటుంది. ప్రస్తుతం దిల్లీ ఎక్స్‌షోరూమ్‌లో డ్రమ్‌ బ్రేక్‌ మోడల్‌ ధర రూ.1,08,565, డిస్క్‌ బ్రేక్‌ మోడల్‌ ధర 1,11,615 గా ఉంది.  ఇక మిగిలిన అంశాల్లో ఎటువంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం ఈ మోటార్‌ సైకిల్‌ 159.7సీసీ సింగల్‌ సిలిండర్‌ , ఫోర్‌ వాల్వ్‌తో లభిస్తోంది. ఆయిల్‌ కూల్డ్‌ ఇంజిన్‌ 17.4 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. ఈ బైక్‌కు 5 స్పీడ్‌ గేర్‌బాక్స్‌ను అమర్చారు. సరికొత్త అపాచీ 2020 మోడల్‌ కంటే 2 కిలోల బరువు తక్కువగా ఉంది. ఈ బైకు రేసింగ్‌ రెడ్‌, నైట్‌బ్లాక్‌, మెటాలిక్‌ బ్లూ రంగుల్లో లభిస్తోంది. ఇక 2020 డిసెంబర్‌లో విడుదల చేసిన బైక్‌కు స్మార్ట్‌క్సోనెక్ట్‌ బ్లూటూత్‌ కనెక్టివిటీ ఫీచర్‌ను ఇచ్చారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని