సుప్రీం తీర్పునకు తగ్గట్లు చర్యలు చేపట్టండి - Take action in accordance with the judgment of the Supreme Court
close

Published : 31/08/2021 01:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుప్రీం తీర్పునకు తగ్గట్లు చర్యలు చేపట్టండి

సెబీకి అమెజాన్‌ విజ్ఞప్తి

దిల్లీ: ప్రతిపాదిత రూ.24,713 కోట్ల ఫ్యూచర్‌-రిటైల్‌ ఒప్పందానికి సంబంధించి జారీ చేసిన ‘నిరభ్యంతర పత్రాల’ను తక్షణం ఉపసంహరించుకోవాలని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఆదేశాలు జారీ చేయాలని సెబీకి అమెజాన్‌ లేఖ రాసింది. అదే సమయంలో ఈ ఒప్పందానికి సంబంధించి తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు తగ్గట్లుగా సరైన చర్యలు చేపట్టాలని కూడా సెబీని కోరింది. కాగా, ఈ అంశంపై మాట్లాడడానికి అమెజాన్‌ నిరాకరించగా.. ఫ్యూచర్‌ గ్రూప్‌నకు పంపిన ఇ-మెయిళ్లకు స్పందన రాలేదు. ఫ్యూచర్‌ గ్రూప్‌ తన ఆస్తుల విక్రయాలను రిలయన్స్‌కు విక్రయించాలన్న ప్రతిపాదనకు ఈ ఏడాది జనవరిలో సెబీ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఒప్పందానికి బీఎస్‌ఈ ఎటువంటి ప్రతికూల పరిశీలనలూ లేవంటూ లేఖను జారీ చేసిన విషయం తెలిసిందే. వీటిపైనే అమెజాన్‌ ఇపుడు సెబీకి లేఖ రాసింది.


ముంబయితో పాటు ఇతర నగరాల్లోనూ పెట్టాలి

డేటాకేంద్రాలతో అధిక విద్యుత్‌ వినియోగం
మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధి రాహుల్‌

ముంబయి: అంతర్జాతీయంగా పెద్ద నగరాలైన ఆమ్‌స్టర్‌డామ్‌, సింగపూర్‌ వంటివి కొత్త డేటా కేంద్రాలకు దూరంగా ఉంటున్నాయి. అవి వినియోగించే అధిక విద్యుతే అందుకు కారణం. ఈ నేపథ్యంలో భారత్‌ కూడా ముంబయిలోనే అన్ని కేంద్రాలనూ ఏర్పాటు చేయడం తగదని మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధి రాహుల్‌ ధార్‌ అంటున్నారు. ముంబయి లేదా దిల్లీ లేదా చెన్నై అంటూ ఒకే నగరానికి పరిమితం చేయకుండా అన్ని నగరాల్లోనూ డేటాకేంద్రాల వికేంద్రీకరణ చేయాలని సూచించారు. ‘మొత్తం నగరానికి ఇవ్వాల్సిన విద్యుత్‌నంతా డేటాకేంద్రాలే లాగేసుకుంటాయి. అందుకే సింగపూర్‌ వంటి అత్యాధునిక నగరం కూడా కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదు. అంతర్జాతీయ అనుభవాల నుంచి భారత్‌ నేర్చుకోవాలి’ అని సీఐఐ నిర్వహించిన ఒక సదస్సులో ఆయన పేర్కొన్నారు. సిఫీ టెక్నాలజీస్‌కు చెందిన కమల్‌నాథ్‌ మాట్లాడుతూ దేశంలోనే తన తొలి డేటాకేంద్రాన్ని వశీ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం దేశంలోని మొత్తం డేటా కేంద్రాల సామర్థ్యం(240 మెగావాట్‌)లో సగం ముంబయిలోనే ఉంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని