కొత్త ఆర్థిక సంవత్సరం.. మీరు చేయాల్సిన 5 పనులు - Tasks-you-need-to-perform-at-the-beginning-of-the-new-financial-year
close

Updated : 02/04/2021 14:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్త ఆర్థిక సంవత్సరం.. మీరు చేయాల్సిన 5 పనులు

మీ ఆర్థిక పరిస్థితులను చక్కగా నిర్వహించడానికి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో మీరు చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి.  కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే, మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని పనులను చూద్దాం.

పీపీఎఫ్ :

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) సాంప్ర‌దాయ‌క  పెట్టుబడులలో ఒకటి. సెక్షన్ 80 సి కింద తగ్గింపును క్లెయిమ్ చేయడానికి ఇందులో ఎక్కువ‌గా పెట్టుబడి పెడతారు. ఏదేమైనా, చాలా మంది చివరి క్షణంలో పీపీఎఫ్‌లో పెట్టుబడులు పెట్టడం చూస్తుంటాం. సంవత్సరం ప్రారంభంలోనే పీపీఎఫ్‌లో డిపాజిట్ మంచిది.
ఒక వ్యక్తి సంవత్సరం ప్రారంభంలో పీపీఎఫ్‌లో పెట్టుబడి పెడితే, ఆ మొత్తం సంవత్సరానికి వడ్డీని సంపాదించవచ్చు, అయితే సంవత్సరం చివరిలో పెట్టుబడులు పెడితే వడ్డీ భాగాన్ని కోల్పోతారు.  ప్రతి నెల ఐదవ వంతులోగా డిపాజిట్ చేయ‌డం మంచిది. ప్రతి త్రైమాసికంలో వ‌డ్డీ రేట్ల‌ను ప్రభుత్వం సవరిస్తుంది. ప్ర‌స్తుత‌ త్రైమాసికంలో వ‌డ్డీ రేట్లు 7.1 శాతంగా ఉన్నాయి.

ఫారం 15 హెచ్ / 15 జి సమర్పించడం:

డిపాజిటర్లకు వడ్డీని చెల్లించే ముందు బ్యాంకులు మూలం వ‌ద్ద ప‌న్ను (టీడీఎస్) తీసివేస్తాయి. అయినప్పటికీ, మీ ఆదాయం మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉంటే,  ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవ‌స‌రం లేక‌పోతే, బ్యాంకులు టీడీఎస్ మినహాయింపును నివారించడానికి మీరు ఫారం 15 జి / హెచ్ సమర్పించవచ్చు. ఈ ఫారాలను ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో బ్యాంకులు, పోస్టాఫీసులకు అందించాలి.

పన్ను విధానంపై నిర్ణయం : 

పన్ను చెల్లింపుదారులకు రెండు పన్ను విధానాల‌ మధ్య ఏదైనా ఎంచుకునే అవకాశం ఉంది. కొత్త ప‌న్ను విధానం ఎంచుకుంటే, పాత పన్ను వ్య‌వ‌స్థ‌లో ఉన్న 70 ర‌కాల మిన‌హాయింపుల‌ను వ‌దులుకోవాల్సి ఉంటుంది. కానీ కొత్త‌దానిలో త‌క్కువ శ్లాబు రేటు ఉంటుంది. మీకు త‌గిన దానిని ఎంచుకోవాలి. పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయంలో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు రెండింటిలో ఒక‌దాన్ని ఎంచుకోవచ్చు.  సంవత్సరం ప్రారంభంలో నిర్ణ‌యించుకుంటే పన్ను  మెరుగైన ప్ర‌ణాళిక‌కు సహాయపడుతుంది.

ఐటీఆర్ ఫైలింగ్ కోసం పత్రాల సేకరణ:

మీరు త్వరలో ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాలి. చివరి నిమిషంలో హ‌డావిడీ చేయ‌కుండా ఇప్ప‌టినుంచే అవ‌స‌ర‌మైన‌  పత్రాలను సేకరించడం ప్రారంభించడం మంచిది.  నేరుగా పెట్టుబడి పెడితే బ్యాంకుల స్టేట్‌మెంట్‌లు,  మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి స్టేట్‌మెంట్‌లు వంటి పత్రాలను సేకరించండి.

మీ పన్నులను ఇప్పుడే ప్లాన్ చేయండి:

చాలా మంది తమ పన్ను ప్రణాళికను ఆర్థిక సంవ‌త్స‌రం ముగిసే స‌మ‌యంలో  చేస్తారు. దీంతో రిస్క్ ప్రొఫైల్‌తో సరిపోలని సాధనాలలో పెట్టుబడులు పెడుతుంటారు. అందుకే ఎందులో పెడితే మీకు ప్ర‌యోజ‌నం ఉంటుంది, ఎంత ప‌న్ను ఆదా అవుతుందో ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ప్లాన్ చేయడం మంచిది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని