భారీ డిస్కౌంట్లు ప్రకటించిన టాటామోటార్స్‌ - Tata Motors Rolls Out Discounts
close

Updated : 18/03/2021 15:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారీ డిస్కౌంట్లు ప్రకటించిన టాటామోటార్స్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటామోటార్స్‌ వినియోగదారులను ఆకర్షించేందుకు వివిధ మోడల్‌ కార్లపై భారీగా డిస్కౌంట్లు ప్రకటించింది. అత్యధికంగా రూ. 65వేల వరకు ఉన్న ఈ డిస్కౌంట్లు మార్చి 31 వరకు అందుబాటులో ఉంటాయి. టియాగో, టిగోర్‌, నెక్సాన్‌, హ్యారియర్‌(5సీట్ల మోడల్‌)లకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఆల్టురజ్‌, సఫారీ ఎస్‌యూవీపై మాత్రం ఎటువంటి ఆఫర్లు ఇవ్వలేదు. కన్జ్యూమర్‌ స్కీమ్‌, ఎక్స్‌ఛేంజి ఆఫర్‌, కార్పొరేట్‌ స్కీమ్‌ల రూపంలో వీటిని అందిస్తోంది. 

టాటా టియాగో మోడల్‌పై రూ.25వేలను తగ్గించింది. వీటిల్లో కన్జ్యూమర్‌ స్కీమ్‌ రూ.15వేలు, ఎక్స్‌ఛేంజి ఆఫర్‌ రూ.10 వేలు ఉన్నాయి. ఇక టిగోర్‌ సెడాన్‌పై కన్జ్యూమర్‌ స్కీమ్‌లో రూ. 15వేలు, ఎక్స్‌ఛేంజి ఆఫర్‌లో రూ.15 వేలు డిస్కౌంట్‌ రూపంలో ఇస్తున్నారు. నెక్సాన్‌ సబ్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీపై రూ.15వేలు డిస్కౌంట్‌గా లభిస్తోంది. ఇదే కారు డీజిల్‌ వెర్షన్‌పై ఎక్స్‌ఛేంజి ఆఫర్‌ మాత్రమే లభిస్తోంది. హారియర్‌ 5సీట్ల మోడల్‌ క్యామో వేరియంట్‌పై మాత్రం రూ.40వేలు లభిస్తోంది. సాధారణ హారియర్‌పై రూ.65 వేల వరకు తగ్గింపు ఉంది. కాకపోతే హారియర్‌లో పరిమిత వేరియంట్లకే ఆఫర్లు వర్తిస్తాయి. కొన్నిటికి వర్తించవు. 

ఇవీ చదవండి

విక్రయానికి 13 విమానాశ్రయాలు!

అమెరికా చమురే ఎందుకు..


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని