రేపటి నుంచి టాటా వాహనధరల పెంపు - Tata Motors To Increase Prices Across Range
close

Published : 07/05/2021 18:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రేపటి నుంచి టాటా వాహనధరల పెంపు

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ వాహన ధరలను పెంచింది.  మే 8వ తేదీ నుంచి పెంపు అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని కంపెననీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ధర పెంపు సగటున 1.8శాతం వరకు ఉందని వెల్లడించింది. మోడల్‌ను.. వేరియంట్‌ను బట్టి కొంత మార్పు ఉండొచ్చని చెప్పింది. నేడు కార్లు బుక్‌ చేసుకొన్న వారికి మాత్రం పాత ధరకే అందిస్తామని వెల్లడించింది. 

ఈ ధర పెంపు నిర్ణయంపై కంపెనీ ప్యాసింజర్స్‌ వెహికల్స్‌ బిజినెస్‌ ప్రెసిడెంట్‌ సుశీల్‌ చంద్ర మాట్లాడుతూ..‘స్టీల్‌, కీలకమైన లోహల ధరలు పెరగడంతో వినియోగదారులపైకి భారం బదలాయించాల్సి వచ్చింది. వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని నేటి వరకు బుక్‌ చేసుకొన్న వారికి పాత ధరలకే వాహనాలను డెలివరీ చేస్తాము. రేపటి నుంచి బుక్‌ చేసుకొనే వారికి కొత్త ధరలు వర్తిస్తాయి. మార్కెట్లో లభిస్తున్న బలమైన ఆదరణతో మా ఉత్పత్తులను కొనసాగిస్తాము. టాటా బ్రాండ్‌పై నమ్మకం ఉంచినందుకు మా వినియోగదారులకు  ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.  టాటా మోటార్స్‌ ధరలను పెంచడం ఈ ఏడాదిలో ఇది రెండో సారి. జనవరిలో ఒక సారి రూ.26 వేల వరకు పెంచింది.  ప్రస్తుతం చాలా వరకు టాటామోటార్స్‌ కర్మాగారాలు కొవిడ్‌ కారణంగా మూసివేశారు. ఏప్రిల్‌లో కంపెనీ విక్రయాలు 41శాతం తగ్గాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని