టాటా మోటార్స్‌కు కొత్త సారథి - Tata Motors names Marc Llistosella as new CEO
close

Published : 13/02/2021 11:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టాటా మోటార్స్‌కు కొత్త సారథి

దిల్లీ: టాటా మోటార్స్‌ కొత్త ఎండీ, సీఈవోగా మార్క్‌ లిస్టోసెల్లాను నియమిస్తున్నట్లు సంస్థ తెలిపింది. గతంలో ఆయన ఫ్యుజో ట్రక్‌, బస్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు, సీఈవోగా, డెమ్లర్‌ ట్రక్స్‌ ఆసియా హెడ్‌గా వ్యవహరించారు. ఈ ఏడాది జులై 1న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత ఎండీ, సీఈవో గుంటర్‌ బషెక్‌ స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు. బషెక్‌ వ్యక్తిగత కారణాల వల్ల కాంట్రాక్టు ముగిసిన తర్వాత జర్మనీకి మారనున్నారు.

మార్క్‌ లిస్టోసెల్లా నియామకం పట్ల టాటా మోటార్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ హర్షం వ్యక్తం చేశారు. వాణిజ్య వాహన రంగంలో మార్క్‌కు అపార అనుభవం ఉందని తెలిపారు. భారత వాహన రంగంపై స్పష్టమైన అవగాహన ఉందన్నారు. ఆయన అనుభవం టాటా మోటార్స్‌ మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మార్క్‌ స్పందిస్తూ.. భారత్‌తో తనకు ఉన్న బంధంలో మరో కొత్త అధ్యాయం ప్రారంభం కానుందని తెలిపారు. కలిసికట్టుగా టాటా మోటార్స్‌ సామర్థ్యాన్ని మరింత ముందుకు తీసుకెళతామని వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి...

పారిశ్రామికోత్పత్తి కళకళ 

రైతులకు ఏడాదికి రూ.2 లక్షల ఆదా


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని