6 ఎయిర్‌బ్యాగ్‌లతో టాటా సఫారీ..ధర ఎంతంటే? - Tata Safari SUV launched in India
close

Published : 22/02/2021 21:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

6 ఎయిర్‌బ్యాగ్‌లతో టాటా సఫారీ..ధర ఎంతంటే?

ముంబయి: ఎట్టకేలకు టాటా మోటార్స్‌ కొత్త సఫారీ మోడల్‌ను విడుదల చేసింది. గ‌త నెల‌లోనే దీన్ని ఆవిష్కరించిన సంస్థ.. ఫిబ్రవరి ఆరంభం నుంచి రూ.30 వేల‌తో బుకింగ్స్ తీసుకుంటోంది. విడుదలైన వెంటనే కారును వినియోగదారులకు అందజేస్తామని వెల్లడించింది. ఇక ఈ కొత్త ఎస్‌యూవీ ప్రారంభ ధరను రూ.14.69 లక్షలుగా(ఎక్స్‌షోరూం) నిర్ణయించారు. వీటిలో అత్యంత అధునాతన ఫీచర్లు కలిగిన అడ్వెంచర్‌ పర్సోనా ఆటోమేటిక్‌ వేరియంట్‌ ధర రూ.21.45 లక్షలుగా ఉంది.

మొత్తం మూడు ట్రిమ్‌లు, 11 వేరియంట్లలో ఈ కారును అందుబాటులోకి తెచ్చారు. ఇవి రాయల్‌ బ్లూ, ఆర్కుస్‌ వైట్‌, డేటోనా గ్రే రంగుల్లో ఈ కార్లు లభించనున్నాయి. కొత్తగా తీసుకొచ్చిన అడ్వెంచర్‌ పర్సోనా వేరియంట్‌ ట్రాపికల్‌ మిస్ట్‌ రంగులోనూ అందుబాటులో ఉంది. ఇక ఇంజిన్‌ విషయానికి వస్తే.. 170 పీఎస్‌ శక్తిని విడుదల చేయగల రెండు లీటర్ల డీజిల్‌ ఇంజిన్‌ను అమర్చారు. సిక్స్‌ స్పీడ్‌ మ్యాన్యువల్‌ లేదా ఆటోమేటిక్‌ వెర్షన్‌ అందుబాటులో ఉంది.

* బేస్ వేరియంట్ అయిన ఎక్స్‌ఈలో రెండు ఎయిర్ బ్యాగులు, అన్ని డిస్క్ బ్రేకులు, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ ప్రోగ్రాంతో పాటు హిల్‌ హోల్డ్‌ కంట్రోల్‌, రోల్‌ఓవర్‌ మిటిగేషన్‌ వ్యవస్థల్ని ఏర్పాటు చేశారు.

* ఇక మ‌ల్టీ డ్రైవ్ మోడ్‌, టచ్‌స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్‌ ఎక్స్‌ఎం వేరియంట్‌తో ప్రారంభమయ్యాయి.

* ఎక్స్‌టీ మోడ‌ల్‌లో ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో పాటు ప‌నోర‌మిక్ స‌న్‌రూఫ్ ఫీచర్లు ఉండ‌నున్నాయి.

* టాప్ మోడ‌ల్ అయిన ఎక్స్‌జెడ్‌లో ఆరు ఎయిర్ బ్యాగులు, ఎల‌క్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్స్‌, 8.8 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ ట‌చ్‌స్క్రీన్‌, 9 జేబీఎల్ స్పీక‌ర్లు, స‌బ్‌వూఫ‌ర్‌, జినాన్ హెచ్ఐడీ ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్‌లు, టెర్రెయిన్‌ రెస్పాన్స్‌ మోడ్‌ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

ఇవీ చదవండి...

6.3 సెకన్లలో 100 కి.మీ వేగం!

జాగ్వార్‌ నుంచి అన్నీ విద్యుత్‌కార్లే


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని