BigBasket: టాటాలకు లైన్‌ క్లియర్‌..! - Tata gets Competition Commission approval to acquire in BigBasket
close

Updated : 29/04/2021 13:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

BigBasket: టాటాలకు లైన్‌ క్లియర్‌..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆన్‌లైన్‌ గ్రాసరీ దిగ్గజం బిగ్‌బాస్కెట్‌ను దక్కించుకోవడానికి టాటా డిజిటల్స్‌కు మార్గం సాఫీ అయ్యింది. గురువారం ఈ కొనుగోలుకు భారత కాంపిటిషన్స్‌ కమిషన్ ఆఫ్‌ ఇండియా ఆమోద ముద్ర వేసింది. దీంతో టాటా డిజిటల్‌ సంస్థ సూపర్‌ మార్కెట్‌ గ్రాసరీ సప్లైస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(ఎస్‌జీఎస్‌)లో 64.3శాతం వాటాను కొనుగోలు చేయవచ్చు. ఎస్‌జీఎస్‌ సంస్థ బిగ్‌బాస్కెట్‌ను నియంత్రిస్తున్న ఇన్నోవేటీవ్‌ రిటైల్‌ కాన్సెప్ట్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో వాటాలను కొనుగోలు చేయడానికి మార్గం సుగమం అయింది.  

టాటా డిజిటల్‌ ఈ కొనుగోలు పూర్తి చేస్తే.. అలీబాబా సంస్థకు కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ సంస్థ తాజాగా బిగ్‌బాస్కెట్‌లో ఉన్న 29శాతం వాటాలను విక్రయించి ఎగ్జిట్‌ కావాలని చూస్తోంది. అంతేకాదు.. దేశీయ బిజినెస్‌ టైకూన్‌ ఆది గోద్రెజ్‌కు  కూడా 16.3శాతం వాటా ఉంది. దాదాపు రూ.9,300 కోట్ల  (1.2బిలియన్‌ డాలర్ల)తో ఈ డీల్‌ నిర్వహించడానికి టాటా సిద్ధమైంది. 

రెడ్‌సీర్‌ నివేదిక ప్రకారం బిగ్‌బాస్కెట్‌ విలువ ఏటా 57శాతం వృద్ధి చెందుతోంది. 2019లో 1.9 బిలియన్‌ డాలర్లు ఉన్న ఈ సంస్థ 2020 చివరి నాటికి 3 బిలియన్‌ డాలర్ల విలువను తాకింది. 2024నాటికి ఈ సంస్థ 18 బిలియన్‌ డాలర్ల మార్కును తాకుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ డీల్‌ పూర్తయితే దేశీయ ఆన్‌లైన్‌ మార్కెట్లో బలమైన పోటీ ఇచ్చేలా టాటాలు కూడా సిద్ధమైనట్లు అవుతుంది. ఇప్పటికే అమెజాన్‌, రిలయన్స్‌,  ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థలు పోటీ పడుతున్నాయి. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని