బడ్జెట్ 2021లో  పన్ను సంస్కరణలు - Tax-benefits-for-common-man-in-budget-2021
close

Updated : 01/02/2021 16:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బడ్జెట్ 2021లో  పన్ను సంస్కరణలు

సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు పన్ను మినహాయింపు : 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లపై పన్ను భారాన్ని కేంద్ర ప్ర‌భుత్వం త‌గ్గించింది. 75 ఏళ్లు పైబడిన పింఛనుదారులకు రిటర్నులు  దాఖలు చేయాల్సిన అవసరం లేదని కేంద్రం ప్రవేశ పెట్టిన బ‌డ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు.  

సరసమైన గృహ రుణానికి అదనపు పన్ను మినహాయింపు పొడిగింపు: గృహ రుణంపై గ‌తంలో ఉన్న‌ పన్ను  మిన‌హాయింపు గ‌డువును 2022 ఆర్థిక‌ సంవ‌త్స‌రం వ‌ర‌కు పొడ‌గిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. అంటే సరసమైన గృహ నిర్మాణ ప్రాజెక్టులు మరో సంవత్సరానికి పన్ను సెలవును పొందవచ్చని ప్రతిపాదించింది.

స్టార్టప్‌ ట్యాక్స్ హాలిడే: స్టార్టప్‌ల కోసం ట్యాక్స్ హాలిడేను మరో ఏడాది పొడిగించాలని కేంద్ర ఆర్థిక‌మంత్రి ప్రతిపాదించారు.

ఐటీఆర్ ఫైలింగ్: సెక్యూరిటీలు, మూలధన లాభాలపై చెల్లించాల్సిన ప‌న్ను ఐటీఆర్‌లలో ముందే నింపి ఉంటుంది. ఇది రిట‌ర్నుల ఫైలింగ్‌ని మరింత సులభతరం చేయడానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.

ప‌న్ను శ్లాబులు య‌థాత‌థం: ఆదాయ‌పు ప‌న్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయ‌లేదు. ముందున్న శ్లాబుల‌నే కొన‌సాగిస్తున్నట్టు ప్రకటించారు. 

ప‌న్నుల వివాదాల ప‌రిష్కారానికి క‌మిటీ: రూ.50 ల‌క్ష‌ల లోపు, రూ.10 ల‌క్ష‌ల లోపు ఆదాయం ఉన్న‌వారు వివాదాల ప‌రిష్కారం కోసం నేరుగా క‌మిటీకి సిఫార్సు చేసుకునే అవ‌కాశం కల్పించింది.

పన్ను కేసులను తిరిగి తెరవడానికి కాల పరిమితిని ఆరేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇది పన్ను చెల్లింపుదారులకు అనిశ్చితిని తగ్గిస్తుందని తెలిపారు. 

ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునళ్లను ఫేస్‌లెస్‌గా చేసి జాతీయ ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ సెంట‌ర్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

డిజిటల్ విధానం ద్వారా తమ వ్యాపారాన్ని ఎక్కువగా చేసే సంస్థలకు పన్ను ఆడిట్  మినహాయింపు పరిమితి రెట్టింపు చేస్తూ రూ. 10 కోట్ల టర్నోవర్‌ వరకు పెంచింది.

రూ. 50 లక్షలకు పైగా ఆదాయాన్ని దాచిపెట్టిన తీవ్రమైన పన్ను నేరాలను పదేళ్ల తర్వాత తిరిగి తెరవవచ్చని ఆర్థిక మంత్రి తెలిపారు.

ఎన్నారైల విదేశీ పదవీ విరమణ ఫండ్స్‌పై  రెట్టింపు ఆదాయ పన్ను లేకుండా త్వరలో ఉత్తర్వులు.

కస్టమ్స్లో 400 పైగా పన్ను మినహాయింపులను మార్చడం 

* ఆదాయ ప‌న్ను చెల్లింపుదారుల సంఖ్య 6.48 కోట్ల‌కు చేరింద‌ని బ‌డ్జెట్ ప్ర‌సంగంలో నిర్మ‌లా సీతారామ‌న్ వెల్లడించారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని