ఈపీఎఫ్ వడ్డీపై పన్నుతో పదవీ విరమణ ప్రణాళికను ప్ర‌భావితం చేస్తుందా? - Tax-on-EPF-may-impact-your-retirement-plans
close

Updated : 12/02/2021 15:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈపీఎఫ్ వడ్డీపై పన్నుతో పదవీ విరమణ ప్రణాళికను ప్ర‌భావితం చేస్తుందా?

సంవత్సరానికి రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ ప్రావిడెంట్ ఫండ్‌కు ఉద్యోగుల వాటాపై వడ్డీకి ప‌న్నుపై 2021 బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదన, ఎక్కువ‌గా పీఎఫ్‌కి కేటాయించే  ఉద్యోగుల కోసం లాభదాయకమైన పదవీ విరమణ పొదుపు ప్ర‌యోజ‌నాన్ని త‌గ్గించింది. ఈ చర్య ఎన్‌పిఎస్‌తో పోలిస్తే ఈపీఎఫ్ పెట్టుబ‌డుల‌పై ఉండే ఆలోచ‌న‌ను మారుస్తుంది.
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ అంటే ఏమిటి?
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌) వ్యవస్థీకృత రంగ ఉద్యోగులకు పదవీ విరమణ నిధి. ఉద్యోగులు త‌ప్ప‌నిస‌రిగా ప్రాథ‌మిక వేత‌నం నుంచి 12 శాతం, డీఏ ఇందులో డిపాజిట్ చేస్తారు. మ‌రో 12 శాతం యాజ‌మాన్య సంస్థ ఖాతాలో డిపాజిట్ చేస్తుంది. య‌జ‌మాని వాటా నుంచి 8.33 శాతం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్‌) కు వెళుతుంది. దీనిపై వ‌డ్డీ ల‌భించ‌దు. మ‌రో 3.67 శాతంతో పాటు మిగ‌తా మొత్తంపై వ‌డ్డీ వ‌స్తుంది.  ఇది గత దశాబ్దంలో 8-9 శాతం పరిధిలో ఉంది.
స్వచ్ఛంద పీఎఫ్ (వీపీఎఫ్‌), మినహాయింపు పీఎఫ్ (ఈపీఎఫ్‌) అంటే ఏమిటి?
వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్‌) అనేది ఈపీఎఫ్ తో స‌మాన‌మైన‌ పదవీ విరమణ ఖాతా. సంస్థ  దీనికి వాటా కేటాయించ‌దు, కానీ ఉద్యోగులు స్వచ్ఛందంగా దీనిలో డిపాజిట్ చేస్తారు. ఇటువంటి పెట్టుబ‌డుఉ సెక్షన్ 80 సి కింద ఎటువంటి పన్ను తగ్గింపును పొందవు.  అయినప్పటికీ, వీపీఎఫ్ కొంతమందికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఎందుకంటే వీపీఎఫ్‌పై కూడా ఈపీఎఫ్ మాదిరిగా వ‌డ్డీ ల‌భిస్తుంది.  రూ.2.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. కొన్ని సంస్థలు తమ ఉద్యోగుల కోసం మినహాయింపు పొందిన పిఎఫ్ ట్రస్టులను కూడా ఏర్పాటు చేశాయి. ఇవి ఈపీఎఫ్‌కు  ప్రాక్సీగా పనిచేస్తాయి, అదే వడ్డీని సంపాదిస్తాయి, ఒకే పన్ను విధానాన్ని కలిగి ఉంటాయి.
ఈ బడ్జెట్ ప్రతిపాదనకు ముందు ప‌న్ను ఎలా ఉండేది?
ఈపీఎఫ్ చారిత్రాత్మకంగా మూడుద‌శ‌ల్లో ప‌న్ను మిన‌హాయింపు  స్థితిని ఆస్వాదించింది. అంటే పెట్టుబ‌డి, వ‌డ్డీ, ఉప‌సంహ‌ర‌ణ స‌మ‌యంలో కూడా ఎటువంటి ప‌న్ను వ‌ర్తించేది కాదు. అయితే ఇప్పుడు సెక్షన్ 80 సి కింద సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఈపీఎఫ్‌, వీపీఎఫ్, మినహాయింపు పొందిన పిఎఫ్ ట్రస్టులపై సంపాదించిన వడ్డీని పన్ను నుంచి మినహాయించారు (ఉద్యోగుల వాటాపై రూ. 2.5 లక్షల వరకు మిన‌హాయింపు). ఈపీఎఫ్ పూర్తి ప‌న్ను మిన‌హాయింపు ఉండ‌గా ఎన్‌పీఎస్‌లో ఉప‌సంహ‌ర‌ణ స‌మ‌యంలో ప‌న్ను వ‌ర్తిస్తుంది

బ‌డ్జెట్ తెచ్చిన  ప‌న్ను ప్ర‌తిపాద‌న‌లు?

కొంతమంది అధిక ఆదాయం ఉన్న‌వారు ఈపీఎఫ్‌లో పెద్ద మొత్తంలో డిపాజిట్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం దానిపై పన్ను రహిత వడ్డీని పొందుతున్నాయి. సంవత్సరానికి రూ. 2.5 లక్షల వరకు ఉద్యోగుల విరాళాలపై వడ్డీకి పన్ను మినహాయింపును యూనియన్ బడ్జెట్ పరిమితం చేసింది. ఇది రూ. 20.8 లక్షల కంటే ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగులను ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, రూ. 30 లక్షల జీతం ఉన్న ఉద్యోగి ఈపీఎఫ్‌లో సంవ‌త్స‌రానికి రూ. 3.6 లక్షలు ఇస్తే, అప్పుడు రూ. 1.1 లక్షలకు సంపాదించిన వడ్డీపై శ్లాబు రేటు ఆధారంగా ప‌న్ను వ‌ర్తిస్తుంది. రూ. 2.5 లక్షల వరకు వడ్డీ పన్ను మినహాయింపుగా కొనసాగుతుంది.

ప్రత్యామ్నాయ పెట్టుబడి ఎంపికలు ఉన్నాయా?
అధిక జీతం సంపాదించే ఉద్యోగి రాబడిని పెంచడానికి, పన్ను తగ్గించడానికి ఈపీఎఫ్‌, ఎన్‌పిఎస్‌లో రెండింటిలో క‌లిపి పెట్టుబ‌డులు పెట్టాలి. మెచ్యూరిటీ తర్వాత ఖాతా నుంచి ఉపసంహరణలు జరిగే వరకు ఎన్‌పిఎస్‌లో రాబడికి పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ సమయంలో, కార్పస్‌లో 60 శాతం పన్ను రహితంగా ఉంటుంది, అయితే 40 శాతం యాన్యుటీని కొనడానికి ఉపయోగించాలి, ఇది పన్ను పరిధిలోకి వస్తుంది. పూర్తి మిన‌హాయింపు కాకపోయినా, రూ. 2.5 లక్షలకు మించిన డిపాజిట్‌పై ఈపీఎఫ్‌లో వ‌డ్డీ వ‌ర్తించే శ్లాబు రేటు కంటే ఇది అనుకూలంగా ఉంటుంది.

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని