కోవిడ్ కార‌ణంగా పీఎఫ్ ఉప‌సంహ‌రించుకుంటే ప‌న్ను వ‌ర్తిస్తుందా? - Tax-on-EPF-withdrawals
close

Updated : 21/04/2021 12:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోవిడ్ కార‌ణంగా పీఎఫ్ ఉప‌సంహ‌రించుకుంటే ప‌న్ను వ‌ర్తిస్తుందా?

కోవిడ్ -19 మహమ్మారి వల్ల ఏర్పడిన ఆర్థిక ఒత్తిడి కారణంగా అత్యవసర నిధులు అవసరమైతే ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా నుండి ఉప‌సంహ‌రించ‌డానికి ప్రభుత్వం గత సంవత్సరం అనుమతించింది.

ఈ నిబంధన ప్రకారం,  ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) సభ్యుడు  ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్‌లో 75 శాతం లేదా మూడు నెలల ప్రాథమిక వేతనాలు, డీఏ రెండూ క‌లిపి ఏది తక్కువైతే దాన్ని ఉపసంహరించుకోవచ్చు.

ఉదాహరణకు, మీరు మీ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో రూ. 1 లక్ష బ్యాలెన్స్ కలిగి ఉంటే, మీ మూడు నెలల ప్రాథమిక వేతనం, డీఏ రూ. 45,000 వరకు ఉంటే, అప్పుడు మీరు రూ. 45,000 వరకు ఉపసంహరించుకోవచ్చు. ఇటువంటి ఉపసంహరణలు సాధారణంగా క్లెయిమ్‌లను స్వీకరించిన మూడు రోజుల్లో ప్రాసెస్ పూర్త‌వుతుంది.

అయితే, మీరు ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఉప‌సంహ‌రించుకోవాల‌నుకుంటే ప‌న్ను వ‌ర్తించే విధానం గురించి తెలుసుకోవ‌డం చాలా ముఖ్యం

* కోవిడ్-సంబంధిత ఒత్తిడి కారణంగా ఆర్థిక ఇబ్బందులో ఈపీఎఫ్ ఖాతా నుంచి ఉప‌సంహ‌ర‌ణ‌లు జరుగుతున్నందున, ప్రభుత్వం ఉద్యోగులకు పన్ను రహితంగా చేసింది.
* ఇది కాకుండా, ఇల్లు కొనడం, పిల్లల విద్య, వివాహం వంటి నిర్దిష్ట ప్రయోజనాల కోసం పన్ను చెల్లింపుదారులను పాక్షికంగా ఉపసంహరించుకోవడానికి ఈపీఎఫ్ఓ ​​అనుమతిస్తుంది. సాధారణంగా ఖాతా ప్రారంభించిన‌ ఐదేళ్ల  తర్వాత దీనికి వీలుంటుంది.   ఉద్యోగం మానేసిన రెండు నెలల  తర్వాత కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్ పూర్తిగా ఉపసంహరించుకోవచ్చు.

పన్ను సమయం:
ఐదేళ్లకు ముందు కోవిడ్ కోసం కాకుండా, ఇతర కారణాల వల్ల ఈపీఎఫ్‌ నుంచి ఉప‌సంహ‌రించుకుంటే ప‌న్నులు వ‌ర్తిస్తాయి.  అయితే ఉపసంహరణ మొత్తం రూ. 50,000 కంటే ఎక్కువ అయితే, సెక్షన్ 192 ఎ కింద 10 శాతం చొప్పున టీడీఎస్ వ‌ర్తిస్తుంది. పాన్ లేకపోతే, టిడిఎస్ 30 శాతం ప‌డుతుంది. అలాగే, ఉపసంహరణ మొత్తం రూ. 30,000 కంటే తక్కువగా ఉంటే, టీడీఎస్ ఉండ‌దు.

ఇది కాకుండా, పన్ను చెల్లింపుదారుడు ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) లో రశీదును చూపించాల్సి ఉంటుంది. సెక్షన్ 80 సి కింద ఉద్యోగి వాటాపై - మినహాయింపు ల‌భిస్తే అది స‌మ‌ర్పించాలి . టీడీఎస్ చెల్లిస్తే మీ పన్ను బాధ్యతను అదే విధంగా సర్దుబాటు చేయడం మర్చిపోవద్దు.

ఉద్యోగులకు అందుబాటులో  కొన్ని ఇతర మినహాయింపులు ఉన్నాయి, వీటి కింద ప్రావిడెంట్ ఫండ్ ఖాతా నుంచి ఉపసంహరణలు ఐదేళ్ళు పూర్తయ్యేలోపు చేసినా పన్ను ఉండ‌దు.
* అనారోగ్యం కారణంగా ఒక ఉద్యోగిని తొలగించినట్లయితే లేదా ప‌నిచేసే సంస్థ‌ వ్యాపారం నిలిచిపోయిన‌ట్ల‌యితే ఉప‌సంహ‌ర‌ణ ప‌రిమితికి మించి ఉన్న‌ప్ప‌టికీ, ఐదేళ్లు ముందే చేసిన‌ప్ప‌టికీ ప‌న్ను వ‌ర్తించ‌దు.

* ఉద్యోగ మార్పు విషయంలో ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్‌ను ఒక యజమాని నుంచి మరొక యజమానికి బదిలీ చేస్తే, పన్నులు లేవు.

* కాబట్టి, మీరు కోవిడ్ కారణంగా ఏదైనా ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటుంటే, ఎటువంటి సందేహం లేకుండా పీఎఫ్ నుంచి డ‌బ్బు తీసుకోవ‌చ్చు. 

* అయితే మీ పదవీ విరమణ పొదుపు కోసం ప్రావిడెంట్ ఫండ్ ఉద్దేశించినందున‌ ఇతర ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నట్లయితే వాటిని ఉప‌యోగించ‌రుకోవాల‌ని ఆర్థిక‌ నిపుణులు సలహా ఇస్తున్నారు.
* ముందుగానే ఉప‌సంహ‌రించుకుంటే కాంపౌండింగ్‌తో  వ‌చ్చే ఎక్కువ ప్ర‌యోజ‌నాన్ని కోల్పోతారు. అదేవిధంగా దీనిపై ఇత‌ర పెట్టుబ‌డుల‌తో పోలిస్తే ఇక్క‌డ అధికంగా 8.5 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. 
* ఒకవేళ మీరు త‌ప్ప‌క‌ ఉపసంహరించుకుంటే, వీలైతే స్వచ్ఛంద ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్‌) ద్వారా సహకారాన్ని పెంచడం మంచిది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని