సార్వభౌమ పసిడి బాండ్లపై పన్ను ఎప్పుడు వర్తిస్తుంది?
గ్రాముకు రూ. 4,662 ధర గల సార్వభౌమ పసిడి బాండ్ల 12 వ దశ ఇష్యూ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇది మార్చి 5న ముగుస్తుంది. ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బంగారు బాండ్లను జారీ చేస్తుంది. ఈ బాండ్లను డిజిటల్ రూపంలో బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఉత్తమమైన మార్గాలలో ఒకటిగా పరిగణించవచ్చు. బంగారం ధరలలో ప్రయోజనం కాకుండా, ఈ బాండ్లు పెట్టుబడిదారులకు పెట్టుబడి పెట్టిన మొత్తంపై 2.5 శాతం స్థిర వడ్డీని అందిస్తాయి. వడ్డీని ఆరునెలలకోసారి చెల్లిస్తారు. కాబట్టి, మీరు బంగారు బాండ్లలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే.. మీ లాభాలు, బంగారు బాండ్ల వడ్డీ ఆదాయానికి ఎలా పన్ను వర్తిస్తుందో అర్థం చేసుకోవాలి.
మూలధన లాభాల పన్ను:
బంగారు బాండ్లకు మెచ్యూరిటీ వ్యవధి ఎనిమిది సంవత్సరాలు. కాబట్టి, ఈ బాండ్లను కొనుగోలు చేసి, మెచ్యూరిటీ వరకు కొనసాగిస్తే, మూలధన లాభాలు పన్ను రహితంగా ఉంటాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ ప్రచురించిన తిరిగి చెల్లించిన తేదీ నుంచి మునుపటి 3 పనిదినాలలో 999 స్వచ్ఛత బంగారం సాధారణ సగటు ముగింపు ధర ఆధారంగా పెట్టుబడిదారులు బంగారు బాండ్లను తిరిగి పొందవచ్చు. ఐదవ సంవత్సరం నుంచి ముందస్తు ఉపసంహరణ కూడా చేసుకునే అవకాశం ఉంది.
మెచ్యూరిటీకి ముందే తీసుకోవాలనుకునేవారు కూపన్ చెల్లింపు తేదీకి ముప్పై రోజుల ముందు సంబంధిత బ్యాంక్ లేదా స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, పోస్ట్ ఆఫీస్ లేదా ఏజెంట్‌ను సంప్రదించవచ్చు. కూపన్ చెల్లింపు తేదీకి కనీసం ఒక రోజు ముందు పెట్టుబడిదారుడు సంబంధిత బ్యాంక్ / పోస్టాఫీసును సంప్రదించినట్లయితే మాత్రమే ముందస్తు ఉపసంహరణ కోసం అభ్యర్థనలు ఆమోదం పొందగలవు. బాండ్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు అందించిన బ్యాంక్ ఖాతాకు ఆదాయం జమ అవుతుంది. ఐదవ సంవత్సరం తరువాత తీసుకుంటే లాభాలపై పోస్ట్ ఇండెక్సేషన్‌తో 20 శాతం పన్ను వర్తిస్తుంది.
బంగారు బాండ్లను స్టాక్ ఎక్స్ఛేంజీలలో కూడా జాబితా చేస్తారు. కాబట్టి, మీరు వాటిని స్టాక్ ఎక్స్ఛేంజ్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు. ఒకవేళ అవి ఒక సంవత్సరానికి ముందే విక్రయిస్తే వచ్చిన లాభాలను పెట్టుబడిదారుడి ఆదాయానికి కలిపితే శ్లాబు రేటు ప్రకారం పన్ను ఉంటుంది. ఒక సంవత్సరం తరువాత లాభాలను దీర్ఘకాలికంగా పరిగణిస్తారు, 10 శాతం పన్ను పడుతుంది.
వడ్డీ ఆదాయంపై పన్ను:
వడ్డీ నేరుగా పెట్టుబడిదారుడి బ్యాంకు ఖాతాలో చేరుతుంది. దీనిపై పూర్తిగా పన్ను ఉంటుంది. వడ్డీ ఆదాయం పెట్టుబడిదారుడి ఆదాయానికి జోడించి, శ్లాబు రేటు ప్రకారం పన్ను లెక్కిస్తారు. అయితే చెల్లించిన వడ్డీపై టీడీఎస్ వర్తించదు.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. క్రెడిట్ స్కోర్ తెలుసుకోవడం ఎలా?
-
Q. హలో సర్, నేను 20 ఏళ్ళ పాటు మ్యూచువల్ ఫండ్స్ లో నెల నెలా రూ. 1500 మదుపు చేయాలనుకుంటున్నాను. మంచి ఫండ్స్ సూచించండి.
-
Q. నమస్తే సర్, నేను ఒక ప్రైవేట్ ఉద్యోగిని. నెలసరి జీతం రూ. 12 వేలలో రూ. 7800 ఖర్చులు పోనీ మిగతా మొత్తని పొదుపు చేయాలనుకుంటున్నాను. సలహా ఇవ్వండి.