టెల్కోల కొత్త నిబంధనలు..నిలిచిపోయిన ఓటీపీలు! - Telcos new regulations blocked SMS OTPs
close

Published : 09/03/2021 13:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టెల్కోల కొత్త నిబంధనలు..నిలిచిపోయిన ఓటీపీలు!

దిల్లీ: వాణిజ్య సందేశాల నియంత్రణ కోసం టెలికాం కంపెనీలు సోమవారం నుంచి అమల్లోకి తెచ్చిన కొత్త నిబంధనలు గందరగోళానికి దారితీశాయి. దీంతో నెట్‌బ్యాంకింగ్‌, క్రెడిట్‌ కార్డు చెల్లింపులు, రైల్వే టికెట్‌ బుకింగ్‌, ఈ-కామర్స్‌, ఆధార్‌ ధ్రువీకరణ, కొవిన్‌ దరఖాస్తు వంటి ఆన్‌లైన్‌ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎస్‌ఎంఎస్‌, ఓటీపీ వంటి సందేశాలు వినియోగదారులకు చేరలేదు. సోమవారం సాయంత్రానికి దాదాపు 40శాతం సందేశాలు పూర్తిగా నిలిచిపోయాయి. టెలికాం కంపెనీలు అమల్లోకి తెచ్చిన కొత్త నిబంధనలతో సాంకేతిక సమస్యలు తలెత్తడమే దీనికి కారణమని తెలుస్తోంది.

ఈ విషయంలో టెలికాం కంపెనీలు, పేమెంట్‌ సహా ఇతర సంస్థలు.. పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. టెల్కోల తప్పిదం వల్లే ఈ సమస్య తలెత్తిందని పేమెంట్‌ సంస్థలు ఆరోపించాయి. మరోవైపు కొత్త నిబంధనల్ని అమలు చేసే ప్రక్రియలో కంపెనీలు చేసిన తప్పిదమే అంతరాయానికి కారణమైందని టెల్కోలు తెలిపాయి. సందేశాలు పంపేవారి ఐడీలను కొత్తగా తీసుకొచ్చిన బ్లాక్‌చైన్‌ ప్లాట్‌ఫాంపై రిజిస్టర్‌ చేయకపోవడం వల్లే సందేశాలు వెళ్లలేదని పేర్కొన్నాయి.

వాణిజ్య సందేశాల నియంత్రణకు ట్రాయ్‌ 2018లో కొత్త నిబంధనల్ని జారీ చేసింది. అవి సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త నియమాల ప్రకారం.. టెలికాం కంపెనీలు ప్రతి ఎస్‌ఎంఎస్‌ను లక్షిత వినియోగదారుడికి పంపే ముందు రిజిస్టర్డ్ మెసేజ్‌తో సరిపోల్చి ధ్రువీకరించాలి. ఇందుకోసం టెలికాం ఆపరేటర్లు బ్లాక్‌చైన్‌ సాంకేతికతను అమల్లోకి తెచ్చారు. దీంట్లో రిజిస్టర్‌ అయిన ఐడీల నుంచి వచ్చిన సందేశాలను మాత్రమే ధ్రువీకరించుకొని వినియోగదారుడికి పంపుతారు. రిజిస్టర్‌ కాని ఐడీల నుంచి వచ్చే సందేశాల్ని నిలిపివేస్తారు.

ఇవీ చదవండి...

10వేల కంపెనీలు స్వచ్ఛంద మూసివేత!

కరోనా సవాళ్ల నుంచి బయటపడ్డాం..


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని