Akasa Air: డిసెంబరులోపు ఆకాశ ఎయిర్‌ కార్యకలాపాలు! - Telugu News Akasa air services to be started by December this year
close

Published : 05/08/2021 15:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Akasa Air: డిసెంబరులోపు ఆకాశ ఎయిర్‌ కార్యకలాపాలు!

 పౌర విమానయాన శాఖ, డీజీసీఏ నుంచి నిరభ్యంతర పత్రం
రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా చౌకధరల విమానయాన సంస్థ

దిల్లీ: స్టాక్‌ మార్కెట్‌ ప్రముఖ మదుపరి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా ఆకాశ ఎయిర్‌ పేరుతో ప్రారంభించబోతున్న చౌకధరల విమానయాన సంస్థకు భారత పౌర విమానయాన శాఖ, డీజీసీఏ నుంచి నిరంభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) లభించినట్లు తెలుస్తోంది. ఈ సంస్థలో 40 శాతం వాటా కోసం రాకేశ్‌ 35 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.260 కోట్లు) పెట్టుబడులు పెడుతున్నారు. ఎన్‌ఓసీ వచ్చిన నేపథ్యంలో ఈ ఏడాది చివరి నాటికి సంస్థ విమానాలు ఎగిరేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. తొలి దశ కింద, నాలుగేళ్లలో 70 విమానాలను సమకూర్చుకోవాలన్నది సంస్థ ప్రణాళిక. ముందుగా కొన్ని విమానాలను తీసుకుని, ఎయిర్‌ ఆపరేటర్‌ పర్మిట్‌ పొందేందుకు సిద్ధం అవుతోంది. ఇండిగో మాజీ ప్రెసిడెంట్‌ ఆదిత్య ఘోష్, జెట్‌ ఎయిర్‌వేస్‌ మాజీ సీఈఓ వినయ్‌ దూబే ఈ సంస్థకు సహ వ్యవస్థాపకులుగా ఉంటారు. ఝున్‌ఝున్‌వాలాతోపాటు ఎయిర్‌బీఎన్‌బీ, పార్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌లు ఆకాశ ఎయిర్‌లో పెట్టుబడులు పెడుతున్నాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ మాజీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రవీణ్‌ అయ్యర్‌ సీఓఓగా ఉండబోతున్నారు. వీరితోపాటు పలు విమానయాన సంస్థల్లో ఉన్నత బాధ్యతలు నిర్వర్తించిన వారు ఈ సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగించనున్న ఈ సంస్థ ముందుగా ఈ నగరానికి దగ్గర్లోని ప్రాంతాలకు సేవలు అందించనుంది. కొవిడ్‌-19 పరిణామాల నేపథ్యంలో విమాన ప్రయాణాలు తగ్గినప్పటికీ.. తమ సంస్థ ప్రారంభం నాటికి పరిస్థితులన్నీ సర్దుకుంటాయని రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా విశ్వాసంతో ఉన్నారు.  


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని