Telecom: టెలికాం సేవల్లో.. 3 ప్రైవేటు సంస్థలు అవసరం  - Telugu News India needs 3 private players in telecom hope govt offers support to industry Airtel CEO
close

Updated : 05/08/2021 12:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Telecom: టెలికాం సేవల్లో.. 3 ప్రైవేటు సంస్థలు అవసరం 

ఎయిర్‌టెల్‌ సీఈఓ గోపాల్‌ విత్తల్‌ 

దిల్లీ: సువిశాల, 130 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశ టెలికాం రంగంలో 3 ప్రైవేటు సంస్థలు, ఒక ప్రభుత్వ సంస్థ ఉండటం శ్రేయస్కరమని భారతీ ఎయిర్‌టెల్‌ సీఈఓ గోపాల్‌ విత్తల్‌ పేర్కొన్నారు. కార్యకలాపాలు కొనసాగించేందుకు వొడాఫోన్‌ ఐడియా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో, ఎయిర్‌టెల్‌ సీఈఓ ఇలా స్పందించడం గమనార్హం. మొదటి త్రైమాసిక ఫలితాల ఎర్నింగ్స్‌ కాల్‌లో గోపాల్‌ మాట్లాడుతూ, ఏజీఆర్‌ బకాయిలను 2022 మార్చిలో చెల్లించలేమని ఒక సంస్థ స్పష్టం చేసిన నేపథ్యంలో,  ప్రభుత్వం నుంచి ఉపశమన చర్యలు ఆశిస్తున్నామని పేర్కొన్నారు. వినియోగదారు నుంచి సగటు ఆదాయం (ఆర్పు) తొలుత రూ.200కు తదుపరి రూ.300కు చేరాల్సిన అవసరం ఉందని వివరించారు. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని