Stock Market: హమ్మయ్య మార్కెట్లకు లాభాలొచ్చాయి.. - Telugu News Indices gains after three-day losing streak
close

Published : 29/07/2021 15:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: హమ్మయ్య మార్కెట్లకు లాభాలొచ్చాయి..

ముంబయి: దేశీయ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్‌ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా ఐటీ, లోహ, ఆర్థిక రంగాల షేర్లలో వెల్లువెత్తిన కొనుగోళ్లతో సూచీలు లాభాలతో కళకళలాడాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సెన్సెక్స్‌ 200 పాయింట్లు ఎగబాకగా.. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 15,750పైన స్థిరపడింది.

కొనుగోళ్ల అండతో ఈ ఉదయం సూచీలు లాభాలతో మొదలయ్యాయి. 52,693 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెక్స్‌ ఒక దశలో 300 పాయింట్లకు పైగా లాభపడింది. అయితే ఆ తర్వాత కొన్ని రంగాల్లో షేర్లలో లాభాల స్వీకరణతో సూచీ కాస్త ఒత్తిడికి గురైనప్పటికీ లాభాలను నిలబెట్టుకుంది. చివరకు 209 పాయింట్ల లాభంతో 52,653 వద్ద ముగిసింది. నిఫ్టీ 69 పాయింట్లు లాభపడి 15,778 వద్ద స్థిరపడింది. 

రంగాల వారీగా లోహ రంగ సూచీ 5శాతం లాభపడింది. ఐటీ, బ్యాంకింగ్, రియాల్టీ సూచీలు 1-3శాతం మేర పెరిగాయి. ఎన్‌ఎస్‌ఈలో హిందాల్కో, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు రాణించగా.. మారుతి సుజుకీ, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, బజాజ్‌ ఆటో, ఐటీసీ, కోల్‌ఇండియా షేర్లు నష్టపోయాయి. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని