Stock Market: లాభాల్లో మొదలైన సూచీలు.. సెన్సెక్స్‌ 200+ - Telugu News Market Indices open in green
close

Updated : 29/07/2021 09:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: లాభాల్లో మొదలైన సూచీలు.. సెన్సెక్స్‌ 200+

ముంబయి: వరుస నష్టాల నుంచి దేశీయ మార్కెట్లు కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా దిగ్గజ రంగ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు అండగా నిలుస్తున్నాయి. దీంతో గురువారం నాటి ట్రేడింగ్‌లో మార్కెట్లు లాభాలతో మొదలుపెట్టాయి. సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా ఎగబాకగా.. నిఫ్టీ 15,750 పైన కదలాడుతోంది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 212 పాయింట్ల లాభంతో 52,651 వద్ద, నిఫ్టీ 59 పాయింట్లు లాభపడి 15,768 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. నేడు టెక్‌ మహీంద్రా, టీవీఎస్‌ మోటార్స్‌ తదితర కంపెనీల త్రైమాసిక ఫలితాలు వెల్లడికానున్నాయి. దీంతో ఆ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇక టైటాన్‌, టాటా మెటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు కూడా రాణిస్తుండగా.. మారుతి సుజుకీ, సిప్లా‌, బజాజ్‌ ఆటో, ఐషర్‌ మోటార్స్‌ షేర్లు నష్టాల్లో మొదలయ్యాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని