SBI Q1 results: అదరగొట్టిన ఎస్‌బీఐ.. 55 శాతం పెరిగిన లాభం - Telugu News SBI net profit in Q1 surges 55 pc to Rs 6504 crore
close

Updated : 04/08/2021 16:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

SBI Q1 results: అదరగొట్టిన ఎస్‌బీఐ.. 55 శాతం పెరిగిన లాభం

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) రాణించింది. మొండి బకాయిలు తగ్గడంతో నికరలాభంలో 55శాతం వృద్ధి నమోదు చేసింది. ఏప్రిల్‌ - జూన్‌ త్రైమాసికంలో స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన ఎస్‌బీఐ రూ. 6,504 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంకు నికర లాభం రూ.4,139.34కోట్లుగా ఉంది. ఇక ఎస్‌బీఐ మొత్తం ఆదాయం(స్టాండ్‌ఎలోన్‌) కూడా పెరిగి రూ. 77,347.17కోట్లకు చేరిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌ సందర్భంగా బ్యాంక్‌ వెల్లడించింది. 

ఇక సమీక్షిస్తున్న త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన కూడా బ్యాంకు లాభం 55శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ - జూన్‌ త్రైమాసికంలో ఎస్‌బీఐ ఏకీకృత నికర లాభం రూ. 4,776.50కోట్లు ఉండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఏకీకృత లాభం రూ. 7,379.91కోట్లకు పెరిగింది. ఏకీకృత ఆదాయం కూడా రూ. 93,266.94కోట్లకు చేరింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో స్థూల నిరర్ధక ఆస్తులు 5.32శాతానికి తగ్గాయి. నికర నిరర్ధక ఆస్తులు 1.7శాతానికి పడిపోయాయి. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని