Stock market: ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు - Telugu News Stock markets Ends flat
close

Updated : 16/07/2021 15:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం స్పల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా ఊగిసలాట ధోరణి కనబరిచాయి. టెలికాం, లోహ, స్థిరాస్తి, ఇంధన, విద్యుత్తు రంగాల నుంచి లభించిన మద్దతును ఐటీ, టెక్‌, బ్యాంకింగ్‌ రంగ షేర్లు నీరుగార్చాయి. అంతర్జాతీయంగానూ ప్రతికూల సంకేతాలు ఉండడంతో సూచీలు అప్రమత్తంగా కదలాడాయి. పైగా ప్రస్తుతం సూచీలు గరిష్ఠాల వద్ద ట్రేడవుతుండడంతో మదుపర్లు స్థిరీకరణ కోసం వేచిచూసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో చివరకు సెన్సెన్స్‌ 18 పాయింట్ల నష్టంతో 53,140 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 0.80 పాయింట్లు నష్టపోయి 15,923 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.56 వద్ద నిలిచింది.

బీఎస్‌ఈ 30 సూచీలో భారతీ ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, అల్ట్రాటెక్ సిమెంట్‌, పవర్‌గ్రిడ్‌, రిలయన్స్‌, ఐటీసీ, సన్‌ఫార్మా, ఎల్‌అండ్‌టీ, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇన్ఫోసిస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని