Oyo IPO: ఓయో ఐపీఓకి అనుమతి ఇవ్వొద్దు.. సెబీకి జోస్టల్‌ లేఖ! - Telugu News Zostel asks Sebi to reject Oyos IPO
close

Published : 12/10/2021 20:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Oyo IPO: ఓయో ఐపీఓకి అనుమతి ఇవ్వొద్దు.. సెబీకి జోస్టల్‌ లేఖ!

దిల్లీ: తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) కోసం ఆతిథ్య సేవల సంస్థ ఓయో చేసుకున్న దరఖాస్తును తిరస్కరించాలని కోరుతూ జోస్టల్‌ హాస్పిటాలిటీ మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీకి లేఖ రాసింది. ఓయో మాతృసంస్థ ఒరావెల్‌ స్టేస్‌.. క్యాపిటల్‌ స్ట్రక్చర్‌ని ఇంకా ఖరారు చేయలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో రూ.8,430 కోట్లు విలువ చేసే ఐపీఓను నిర్వహించడం నిబంధనల ప్రకారం సాధ్యం కాదని చెప్పుకొచ్చింది. పైగా ఐపీఓ అనుమతి కోసం సమర్పించిన ప్రాథమిక పత్రాల్లో చాలా తప్పుడు ప్రకటనలు ఉన్నాయని ఆరోపించింది. తద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని పేర్కొంది. ఈ ఆరోపణలను ఓయో ఖండించింది. ఓయోపై ఆరోపణలు చేస్తూ కోర్టులు, ట్రైబ్యునళ్లలో విఫలయత్నం చేసిన జోస్టల్‌.. తమ సంస్థకు తప్పుడు ఉద్దేశాన్ని ఆపాదించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. తమ వ్యాపార లక్ష్యాన్ని చేరుకోవడంలో జోస్టల్‌ అడ్డుతగులుతోందని తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఓయో ఐపీఓకి అనుమతి రావడలో ఆలస్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

వివాదం ఇదీ..

జోస్టల్‌ను కొనుగోలు చేసేందుకు ఓయో 2016లో ఒప్పందం చేసుకుంది. అయితే, ఈ లావాదేవీని పూర్తి చేయడంలో ఓయో 2017 సెప్టెంబరు వరకు జాప్యం చేస్తూ వచ్చింది. దీంతో జోస్టల్‌ మధ్యవర్తిత్వ ట్రిబ్యునళ్లను ఆశ్రయించింది. అయితే, తీర్పు సంస్థకు ప్రతికూలంగా వచ్చింది. కుదిరిన ఒప్పందం నాన్‌ బైండింగ్‌ అని.. నిర్దిష్ట నిబంధనలేమీ ఖరారు కాలేదన్న ఓయో వాదనలతో ట్రైబ్యునల్‌ ఏకీభవించింది. జోస్టల్‌ మాత్రం ఒప్పందం ప్రకారం తమకు ఒరావెల్‌లో 7 శాతం ఈక్విటీ సెక్యూరిటీలు రావాలని వాదిస్తోంది. దీన్ని అమలు చేయని పక్షంలో ఐపీఓకి అనుమతించొద్దని తాజాగా సెబీని కోరింది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని