Stock Market: కొత్త రికార్డుల్లో సూచీలు - Telugu News markets hit with new records
close

Published : 15/07/2021 15:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: కొత్త రికార్డుల్లో సూచీలు

ముంబయి: కొనుగోళ్ల సందడితో స్టాక్‌ మార్కెట్‌ బుల్‌ జోరుమీదుంది. వరుసగా నాలుగో రోజు లాభాల్లో పరుగులు తీసింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు ఐటీ రంగ షేర్లలో వెల్లువెత్తిన కొనుగోళ్లు మార్కెట్‌ను ముందుకు నడిపించాయి. దీంతో దేశీయ సూచీలు సరికొత్త జీవనకాల గరిష్ఠాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 53వేల మైలురాయిని దాటగా.. నిఫ్టీ 15,900 మార్క్‌పైన స్థిరపడింది. 

ఈ ఉదయం లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు రోజంతా అదే ఉత్సాహాన్ని కొనసాగించాయి. 52,968 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్‌ ఒక దశలో 53,266 వద్ద కొత్త రికార్డును తాకింది. అయితే ఆ తర్వాత కొన్ని రంగాల షేర్లలో లాభాల స్వీకరణతో కాస్త తడబడిన సూచీ చివరకు 254.80 పాయింట్ల లాభంతో 53,158.85 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 70 పాయింట్లు లాభపడి 15,924.20 వద్ద కొత్త రికార్డుతో ముగిసింది. 

దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలను అందుకున్నాయి. రియాల్టీ, ఐటీ రంగ షేర్లు రాణించగా.. ఆటో, బ్యాంకింగ్, ఫార్మా, మీడియా సూచీలు స్వల్ప నష్టాలను నమోదు చేశాయి. ఎన్‌ఎస్‌ఈలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎల్‌ అండ్‌ టీ, విప్రో, టెక్‌ మహీంద్రా, హిందాల్కో షేర్లు లాభపడగా.. ఓఎన్‌జీసీ, ఐషర్‌ మోటార్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, గ్రాసిమ్‌, కోల్‌ ఇండియా షేర్లు నష్టపోయాయి. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని