Stock market Closing Bell: బుల్‌ జోరు.. లాభాల్లో పరుగులు - Telugu news Sensex soars 638 pts to end at 52837
close

Updated : 22/07/2021 16:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market Closing Bell: బుల్‌ జోరు.. లాభాల్లో పరుగులు

ముంబయి: బుల్‌ రంకేసింది.. కొనుగోళ్ల అండతో ఉత్సాహంగా ఉరకలేసింది. దీంతో దేశీయ మార్కెట్లు లాభాలతో కళకళలాడాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సెన్సెక్స్‌ ఏకంగా 600 పాయింట్లకు పైగా ఎగబాకగా.. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 15,800 మార్క్‌పైన స్థిరపడింది.

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా లోహ, బ్యాంకింగ్‌, ఆర్థిక, రియాల్టీ రంగాల షేర్లలో కొనుగోళ్లు సూచీలను పరుగులు పెట్టించాయి. 52,494 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించిన సెన్సెక్స్‌ మొదట్లో కాస్త తడబడినా రోజంతా అదే ఉత్సాహంతో సాగింది. చివరకు 638.70 పాయింట్లు ఎగబాకి 52,837 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 191.90 పాయింట్లు లాభపడి 15,824 వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు రాణించాయి. ఎన్‌ఎస్‌ఈలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ షేర్లు భారీగా లాభపడ్డాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ 1.5శాతం మేర పెరిగాయి. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని