Stock market: స్వల్ప లాభాల్లో సూచీలు - Telugu news Stock markets are in Green
close

Updated : 16/07/2021 09:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: స్వల్ప లాభాల్లో సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు సూచీల పరుగును కట్టడి చేస్తున్నాయి. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ 56 పాయింట్ల లాభంతో 53,215 వద్ద.. నిఫ్టీ 23 పాయింట్లు లాభపడి 15,947 వద్ద కొనసాగుతున్నాయి. దీంతో సూచీలు తాజా గరిష్ఠాలకు చేరాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.54 వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు సైతం నేడు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. దేశీయంగా లోహ, స్థిరాస్తి, విద్యుత్తు, మౌలిక రంగ షేర్లు రాణిస్తున్నాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో ఐటీసీ, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్‌ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్ మహీంద్రా, ఇన్ఫీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని