Stock Market: ఒడుదొడుకుల్లో స్టాక్‌మార్కెట్‌ సూచీలు - Telugu news stock market indices starts volatile session
close

Updated : 05/08/2021 09:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: ఒడుదొడుకుల్లో స్టాక్‌మార్కెట్‌ సూచీలు

ముంబయి: గత రెండు సెషన్లలో భారీ లాభాలను ఆర్జించిన దేశీయ మార్కెట్లు గురువారం ఒడుదొడుకుల్లో సాగుతున్నాయి. ఈ ఉదయం సూచీలు లాభాలతో ప్రారంభమైనప్పటికీ కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలతో పాటు మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన వేళ సూచీలు రికార్డుల నుంచి వెనక్కి వచ్చాయి. ప్రస్తుతం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 45 పాయింట్ల నష్టంతో 54,324 వద్ద, నిఫ్టీ 14 పాయింట్ల నష్టంతో 16,244 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. బ్యాకింగ్ నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతోంది. విప్రో, టెక్‌మహీంద్రా, ఐషర్‌ మోటార్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. ఎస్‌బీఐ, టాటాస్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టాల్లో సాగుతున్నాయి. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని