RBI Interest Rates: కీలక వడ్డీరేట్లు మళ్లీ యథాతథం! - Telugu newsrbi lending rates unchanged once again
close

Updated : 06/08/2021 11:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RBI Interest Rates: కీలక వడ్డీరేట్లు మళ్లీ యథాతథం!

దిల్లీ: కీలక రేట్లలో ఆర్‌బీఐ మరోసారి ఎలాంటి మార్పులు చేయలేదు. ద్రవ్యోల్బణం నిర్దేశిత లక్ష్యం కంటే ఎక్కువగానే ఉన్నప్పటికీ.. ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం కోసం కీలక రేట్ల జోలికి ఆర్‌బీఐ వెళ్లలేదని స్పష్టమవుతోంది. దీంతో ప్రస్తుతం ఉన్న 4 శాతం రెపోరేటు, 3.3 శాతం రివర్స్‌ రెపోరేటు వరుసగా ఆరోసారి యథాతథంగా కొనసాగనున్నాయి.

గవర్నర్‌ ప్రసంగంలోని కీలకాంశాలు..

* ప్రస్తుత పరిస్థితుల్లో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టినా అది ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. 

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 9.5 శాతంగా ఉండనుంది. గత సమీక్షకు ఇప్పటికీ దీంట్లో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. 

* ఆర్‌బీఐ ప్రకటించిన ఈ సర్దుబాటు వైఖరి విధానానికి ఎంపీసీ కమిటీలో ఏకగ్రీవ ఆమోదం లభించలేదు. 

* మే నెలలో వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ(సీపీఐ) కలవరపరిచింది. కానీ, ప్రస్తుతం ధరల పెరుగుదలలో కాస్త స్థిరత్వం వచ్చింది. స్థూలంగా విపణిలో డిమాండ్‌ పుంజుకుంటుంది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇంకా బలహీనంగానే ఉన్నాయి. కానీ, సరఫరా-గిరాకీ మధ్య సమతుల్యత కోసం ఇంకా కొన్ని చర్యలు చేపట్టాల్సి ఉంది. 

* జూన్‌తో పోలిస్తే కరోనా వైరస్‌ వ్యాప్తి విషయంలో ప్రస్తుతం పరిస్థితులు కాస్త చక్కబడ్డప్పటికీ.. మూడో వేవ్‌ ముప్పు ఇంకా పొంచి ఉంది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండడం ముఖ్యం.

* వ్యాక్సిన్‌ ఉత్పత్తి, పంపిణీ వేగంగా కొనసాగుతున్నాయి. అయినప్పటికీ మూడో వేవ్‌ ముప్పుపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. 

* 2021-22లో వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 5.7 శాతంగా ఉండనుంది. ఇది రెండో త్రైమాసికంలో 5.9 శాతంగా, మూడో త్రైమాసికంలో 5.3 శాతంగా, నాలుగో త్రైమాసికంలో 5.8 శాతంగా ఉండనుంది. 2022-23 తొలి త్రైమాసికంలో 5.1 శాతంగా ఉండనున్నట్లు ఆర్‌బీఐ అంచనా వేసింది.

* ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజాన్ని సూచించే ప్రధాన సూచీలన్నీ పురోగమిస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని