కోటి రూపాయ‌ల‌ టర్మ్ పాల‌సీ స‌రిపోతుందా? - Term-life-insurance-of-1-crore
close

Published : 27/12/2020 12:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోటి రూపాయ‌ల‌ టర్మ్ పాల‌సీ స‌రిపోతుందా?

బీమా సంస్థ‌లు ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో, సోష‌ల్ మీడియాలో కోటి రూపాయ‌ల బీమా పాల‌సీ గురించి జోరుగా ప్ర‌చారం చేస్తుంటాయి. అందులో…

  • కోటి రూపాయ‌ల ట‌ర్మ్ బీమా పాల‌సీతో మీ కుటుంబాన్ని సంర‌క్షించుకోండి

  • నెల‌కు రూ.500 ప్రీమియం చెల్లించే విధంగా కోటి రూపాయ‌ల ట‌ర్మ్ బీమా పాల‌సీని తీసుకోండి

  • కోటి రూపాయ‌ల ట‌ర్మ్ పాల‌సీ స‌రిపోతుంది అనేవిధంగా ప్ర‌చారం చేస్తారు.

సంస్థ‌లు త‌మ మార్కెట్‌ను విస్త‌రించుకునేందుకు కోటి రూపాయ‌ల ట‌ర్మ్ బీమా పాల‌సీ తీసుకోవాల్సిందిగా సూచిస్తాయి. మొత్తానికి మీరు ఉన్నా లేక‌పోయినా కోటీ రూపాయ‌ల ట‌ర్మ్ బీమా తీసుకుంటే చాలు అన్న‌ట్లుగా ప్ర‌చారం చేస్తాయి. అయితే నిజంగా కోటి రూపాయ‌ల బీమా కుటుంబానికి ఆర్థిక భ‌రోసానిస్తుందా? తెలుసుకుందాం…

  • కుటుంబ స‌భ్యులు వారు జీవిత‌కాలం నివ‌సించేందుకు కోటి రూపాయ‌లు సరిపోతాయా?

  • పిల్ల‌ల‌కు ఉన్న‌త విద్య అందించ‌గ‌లుగుతారా?

  • చెల్లించాల్సిన రుణం ఎంత ? ఎలా చెల్లిస్తారు?

  • కుటుంబం సంతోషంగా జీవించేందుకు ఇది స‌రిపోతుందా?

  • ప‌ద‌వీ విరమణ తర్వాత, నెలవారీ ఖర్చులు కోసం మీ భర్త లేదా భార్య‌ మీ పిల్లల మీద‌ ఆధారపడతారా?

చాలా కుటుంబాలు కోటి రూపాయ‌ల ట‌ర్మ్ బీమా పాల‌సీతో ప్ర‌యోజ‌నం పొందిన‌ట్లు చెప్తారు. అయితే అది వారికి ఆర్థిక విష‌యాల‌పై ఉన్న అవ‌గాహ‌న లోపం అనే చెప్పుకోవ‌చ్చు. ఇప్పుడు కొన్ని ఉదాహ‌ర‌ణ‌లో ప‌రిశీలిస్తే…

సుమిత్ అనే ఒక ఐటీ ఉద్యోగి వ‌య‌సు 38 సంవ‌త్స‌రాల వ్య‌క్తి, అత‌ని భార్య స్వాతి వ‌య‌సు 35 సంవ‌త్స‌రాలు, గృహిణి. వారి కుటుంబ ఖ‌ర్చుల‌ను ఒక‌సారి గ‌మ‌నిస్తే…
ఇంటి ఖ‌ర్చులు - రూ.40,000
వ్య‌క్తిగ‌త ఖ‌ర్చులు - రూ.10,000
మొత్తం - రూ.50,000

వారు విలాసవంత‌మైన‌ జీవ‌న‌శైలిని అనుస‌రిస్తున్నారు. ప‌దవీ విర‌మ‌ణ త‌ర్వాత కూడా అలాగే ఉండాల‌ని అనుకుంటున్నారు. ప్ర‌స్తుతానికి వారికి ఎలాంటి రుణాలు లేవు. పీపీఎఫ్‌, మ్యూచువ‌ల్ ఫండ్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టిన పెట్టుబ‌డులు క‌లిపి రూ.25 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉన్నాయి. వారు 85 సంవ‌త్స‌రాల వ‌య‌సు వ‌ర‌కు జీవిస్తార‌నుకుంటే , నెల‌కు ఖ‌ర్చు రూ.50 వేలు…అయితే సుమిత్‌కు రూ.2.35 కోట్ల జీవిత బీమా పాల‌సీ అవ‌స‌రం. ఆస్తుల‌ను తీసివేస్తే క‌నీసం రూ.2.1 కోట్లు అవ‌స‌రం అవుతాయి.

ఇది ద్ర‌వ్యోల్బ‌ణం కంటే 1 శాతం రాబ‌డి ఎక్కువ ఉంటేనే ఇది సాధ్య‌మ‌వుతుంది. అంటే ద్ర‌వ్యోల్బ‌ణం 6 శాతం ఉంటే రాబ‌డి 7 శాతం ఉండాలి. ఒక‌వేళ కోటి రూపాయ‌ల ట‌ర్మ్ పాల‌సీ తీసుకుంటే సుమిత్ కుటుంబం కేవ‌లం 25 ఏళ్లు మాత్ర‌మే మంచి జీవ‌నాన్ని కొన‌న‌సాగించ‌గ‌ల‌దు.

పైన ఉదాహ‌ర‌ణ‌లో మ‌రిన్ని అంశాల‌ను చేరిస్తే ,
ఇంటి ఖ‌ర్చులు రూ.40,000
వ్య‌క్తిగ‌త ఖ‌ర్చులు రూ.10,000
గృహ రుణం రూ.40 ల‌క్ష‌లు
కారు రుణం రూ.5 ల‌క్ష‌లు
మొత్తం వ్య‌యాలు రూ 50,000

వీటిన్నింటితో క‌లిపి సుమిత్‌కు రూ.2.8 కోట్ల జీవిత బీమా పాల‌సీ అవ‌స‌రం. రూ.25 ల‌క్ష‌ల ఆస్తులు తీసేస్తే క‌నీసం రూ.2.55 కోట్లు కావాలి. సుమిత్ కోటి రూపాయ‌ల ట‌ర్మ్ బీమా పాల‌సీ కొన‌సాగిస్తే 15 సంవ‌త్స‌రాలు మాత్ర‌మే సంతోషంగా జీవించ‌గ‌ల‌రు.

ఈ ఉదాహ‌ర‌ణ‌లో మ‌రిన్ని మార్పులు చేస్తే,
సుమిత్, స్వాతి ల‌కు 5 సంవ‌త్స‌రాల కొడుకు ఉన్నాడ‌నుకుందాం. అప్పుడు ఖ‌ర్చులు ఎలా ఉంటాయో చూద్దాం…
ఇంటి ఖ‌ర్చులు రూ.50,000 ( పిల్ల‌వాడి ఖ‌ర్చు కోసం మ‌రో రూ.10,000)
వ్య‌క్తిగ‌త ఖ‌ర్చులు రూ.10 వేలు
గృహ రుణం రూ.40 ల‌క్ష‌లు
కారు రుణం రూ.5 ల‌క్ష‌లు
పిల్ల‌ల ఉన్న‌త విద్య‌క‌కు రూ.20 ల‌క్ష‌లు (ఇప్పుడున్న ఖ‌ర్చుల ప్ర‌కారం)
మొత్తం వ్య‌యాలు రూ.60,000

నెల‌కు రూ.60 వేల ఖ‌ర్చుతో 85 సంవ‌త్స‌రాలు జీవించాలంటే సుమిత్ రూ.3.45 కోట్ల బీమా పాల‌సీ తీసుకోవాల్సి ఉంటుంది. ఆస్తుల‌ను తీసివేస్తే క‌నీసం రూ.3.2 కోట్లు అవ‌స‌రం. లేదా సుమిత్ అదేవిధంగా కేవ‌లం కోటి రూపాయ‌ల బీమా పాల‌సీని కొన‌సాగిస్తే వారి కుటుంబ స‌భ్యులు వ‌చ్చే 10 ఏళ్లు మాత్ర‌మే ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా జీవించ‌గ‌ల‌రు . ఇది కారు, ఇళ్లు, ఉన్న‌త విద్య కోసం ఖర్చులు తీసివేయ‌గా వేసిన అంచ‌నా. ఆస్తుల‌ను కూడా క‌లిపి ఆ గ‌ణాంకాల ప్ర‌కారం లెక్కించారు.

మ‌రి కోటి రూపాయ‌ల పాల‌సీ స‌రిపోతుందా?
అది నెల‌వారి ఖ‌ర్చులు, ఆస్తులు, రుణాలు, ల‌క్ష్యాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఒక‌వేళ మీ నెల ఖ‌ర్చులు రూ.27 వేలు అనుకుంటే (ద్ర‌వ్యోల్బ‌ణం స‌ర్దుబాటు అవుతుంది), రూ.25 ల‌క్ష‌ల ఆస్తులు ఉన్నాయి. ఎలాంటి రుణాలు లేక‌పోతే కోటి రూపాయ‌ల పాల‌సీ స‌రిపోతుంది. మీకు రుణాలు, ఇత‌ర బాధ్య‌తలు ఉన్న‌ప్పుడు వాటిని కూడా క‌లుపుకోవాలి. జీవిత బీమా పాల‌సీ కూడా అవ‌స‌రం (ఏడాదికి ఒక‌సారి ప్రీమియంను చెల్లించాలి). ఇది ఎటుంటి అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఉప‌యోగ‌ప‌డ‌దు.

చివ‌ర‌గా
ద్ర‌వ్యోల్బ‌ణం రోజురోజుకి పెరుగుతున్న ఈ త‌రుణంలో ఇంకా కోటి రూపాల‌య బీమా పాల‌సీనే న‌మ్ముకుంటే కుటుంబ స‌భ్యుల‌కు త‌గినంత ఆర్థిక భ‌రోసా ఇవ్వ‌లేరు. బీమా సంస్థ‌లు కోటి రూపాయ‌ల బీమా పాల‌సీ అనే ఒక విధానానికి అల‌వాటు ప‌డి దానినే ప్ర‌జ‌ల‌కు చేర‌వేస్తున్నాయి. కోటి రూపాయ‌ల పాల‌సీ ఉంటే చాలు కుటుంభ ఆర్థిక భ‌ద్ర‌త‌కు భ‌రోసా అనేవిధంగా ప్ర‌చారం చేస్తున్నాయి. కోటి రూపాయ‌ల పాల‌సీ అనేది వినేందుకు బాగానే ఉన్నా మీ అవ‌స‌రాలు అంత‌కు మించి ఉండ‌వ‌చ్చు. కాబ‌ట్టి కుటుంబం, ఆర్థిక ప‌రిస్థితి, జీవ‌న విధానానికి త‌గిన‌ట్లుగా అంచ‌నా వేసి స‌రైన పాల‌సీని తీసుకోవాలి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని